Thalapathy Vijay Shah Rukh Khan: అట్లీ సినిమాలో దళపతి విజయ్, షారుక్ ఖాన్.. ఫ్యాన్స్‌కు పండగే-thalapathy vijay shah rukh khan come together for atlees movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Thalapathy Vijay Shah Rukh Khan Come Together For Atlees Movie

Thalapathy Vijay Shah Rukh Khan: అట్లీ సినిమాలో దళపతి విజయ్, షారుక్ ఖాన్.. ఫ్యాన్స్‌కు పండగే

Hari Prasad S HT Telugu
Nov 15, 2023 08:03 AM IST

Thalapathy Vijay Shah Rukh Khan: అట్లీ సినిమాలో దళపతి విజయ్, షారుక్ ఖాన్ కలిసి నటించబోతున్నారా? అదే జరిగితే ఫ్యాన్స్‌కు పండగే. ఈ విషయాన్ని స్వయంగా అట్లీయే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

షారుక్ ఖాన్, దళపతి విజయ్
షారుక్ ఖాన్, దళపతి విజయ్

Thalapathy Vijay Shah Rukh Khan: సిల్వర్ స్క్రీన్ పై ఒకేసారి తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహను నిజం చేసే ప్రయత్నంలో ఉన్నాడు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్. ఈ మధ్యే షారుక్ తో జవాన్ మూవీ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్న అట్లీ.. తన నెక్ట్స్ మూవీలో ఈ ఊహను నిజం చేయనున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

దళపతి విజయ్, షారుక్ ఖాన్ లను కలిపి ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అట్లీ కుమార్ చెప్పడం విశేషం. దీనికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లూ రెడీగా ఉన్నట్లు అట్లీ స్పష్టం చేశాడు. ఈ మధ్య లియో స్టార్ విజయ్ ని ఓ పార్టీకి తాను పిలిచానని, అక్కడే షారుక్ తో సినిమా గురించి చెప్పగా దానికి అతడు ఓకే చెప్పినట్లు అట్లీ వెల్లడించాడు.

ఆ తర్వాత విజయ్, షారుక్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై మాట్లాడుకున్నారట. తర్వాత ఇద్దరూ కలిసి అట్లీని పిలిచి తాము రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో అట్లీ చెప్పాడు. ఇప్పుడీ ఇంటర్వ్యూకి చెందిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ హిట్స్ తో షారుక్ ఖాన్.. లియో హిట్ తో దళపతి విజయ్ ఊపు మీదున్నారు.

ప్రస్తుతం విజయ్ తన నెక్ట్స్ మూవీ దళపతి 68 షూటింగ్ లో బిజీగా ఉండగా.. షారుక్ ఖాన్ తన డంకీ మూవీ రిలీజ్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ సినిమా సలార్ రిలీజయ్యే డిసెంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు షారుక్, విజయ్ కలిసి నటించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి రేపుతోంది.

సోషల్ మీడియాలో వాళ్లు తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ లోడింగ్ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక అన్ని రికార్డులూ తెరమరుగవడం ఖాయమని మరో అభిమాని అన్నాడు. ఇప్పటికీ విజయ్, అట్లీ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. 2016లో తొలిసారి తెరి, 2017లో మెర్సెల్, 2019లో బిగిల్ మూవీస్ రావడం విశేషం.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.