Dunki Teaser: ప్రేమ, స్నేహ బంధాలతో డంకీ టీజర్.. ఆకట్టుకుంటున్న షారుక్, తాప్సీ, విక్కీ కౌశల్-shahrukh khan dunki teaser released on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shahrukh Khan Dunki Teaser Released On His Birthday

Dunki Teaser: ప్రేమ, స్నేహ బంధాలతో డంకీ టీజర్.. ఆకట్టుకుంటున్న షారుక్, తాప్సీ, విక్కీ కౌశల్

Sanjiv Kumar HT Telugu
Nov 02, 2023 01:50 PM IST

Dunki Teaser On Shahrukh Khan Birthday: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన సినిమా డంకీ. నవంబర్ 2 షారుక్ ఖాన్ బర్త్ డే కానుకగా డంకీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో డంకీ టీజర్ వైరల్ అవుతోంది.

షారుక్ ఖాన్ తాప్సి డంకీ మూవీ టీజర్ విడుదల
షారుక్ ఖాన్ తాప్సి డంకీ మూవీ టీజర్ విడుదల

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. అంతేకాకుండా వేల కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసి ఆ సినిమాలు ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు మరో విభిన్నాత్మక చిత్రంతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు షారుక్ ఖాన్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ. తాజాగా షారుక్ ఖాన్ 58వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న గురువారం డంకీ టీజర్ విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

విదేశాలకు వెళ్లాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ ‘డంకీ’ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్న ఈ కథలో ప్రేమ, స్నేహ బంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే డంకీ సినిమాను రాజ్ కుమార్ హిరాణీ తన మార్క్‌ స్టైల్ వినోదభరితంగా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ వంటి వారి పాత్రలను పరిచయం చేశారు.

డంకీ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రిస్మస్‌కు అందరి మనసులు గెలుచుకునేందుకు ‘డంకీ’ రానున్నట్లు వెల్లడించారు. అంటే క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 22న డంకీ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై రాజ్ కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్‌లు సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రాజ్ కుమార్ హిరాణి, అభిజాత్ జోషి, కనికా థిల్లాన్ రాసిన ఈ కథను రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించారు. అయితే, రాజ్ కుమార్ హిరాణి తీసిన సినిమాలు, చెప్పిన కథలు దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. మరోసారి సున్నితమైన ప్రేమ, స్నేహం అనే అంశాల చుట్టూ, హాస్యభరితంగా తెరకెక్కించిన ‘డంకీ’ థియేటర్లో వచ్చేందుకు సిద్దంగా ఉంది. అంతేకాకుండా షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబోలో మొదటిసారిగా సినిమా వస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.