తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Vs Chittibabu: చిల్లరగా మారిన సమంత, చిట్టిబాబు పంచాయితీ.. అక్కడెక్కడో వెంట్రుకల దాకా వెళ్లింది

Samantha vs Chittibabu: చిల్లరగా మారిన సమంత, చిట్టిబాబు పంచాయితీ.. అక్కడెక్కడో వెంట్రుకల దాకా వెళ్లింది

Hari Prasad S HT Telugu

28 April 2023, 13:05 IST

    • Samantha vs Chittibabu: చిల్లరగా మారింది సమంత, చిట్టిబాబు పంచాయితీ. ఇద్దరి మధ్య విమర్శలు అక్కడెక్కడో వెంట్రుకల దాకా వెళ్లింది. శాకుంతలం సినిమా నుంచి మొదలైన వీళ్ల గొడవ ఇప్పుడు హద్దు మీరింది.
సమంత
సమంత

సమంత

Samantha vs Chittibabu: టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ సమంత, నటడు చిట్టిబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శాకుంతలం మూవీ ఫెయిల్యూర్ నుంచి మొదలైన ఈ పంచాయితీ ఇప్పుడు ఎక్కడెక్కిడికో వెళ్తోంది. ఆ సినిమా సమంతతోపాటు మేకర్స్ కు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

బాక్సాఫీస్ దగ్గర దారుణమైన కలెక్షన్లతో నిర్మాతలను నిండా ముంచింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ఎంతో మంది ఎన్నో కారణాలు చెప్పారు. అసలు గుణశేఖర్ సినిమా తీసిన తీరే బాగా లేదని, క్యారెక్టర్ల ఎంపిక, నాసిరకం గ్రాఫిక్స్ లాంటివి మూవీ కొంప ముంచాయని అన్నారు. నటుడు చిట్టిబాబు మాత్రం దీనికి సమంతనే కారణమని నిందించాడు.

అసలు ఆమె మునుపటిలా లేదని, మయోసైటిస్ బారిన పడిన తర్వాత సమంత ముఖం పూర్తిగా పాడైపోయి, ముసిలిదానిలాగా కనిపిస్తోందని విమర్శించాడు. ఇక హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసినట్లేనని, ఇక నుంచి సైడ్ క్యారెక్టర్లు చేసుకోవాలనీ అన్నాడు. ఇది సమంతకు ఏమాత్రం మింగుడు పడలేదు. దీనిపై ఆమె కూడా చాలా ఘాటుగా స్పందించింది.

అయితే చిట్టిబాబును నేరుగా విమర్శించకుండా అతని చెవి వెంట్రుకల గురించి సామ్ కామెంట్ చేసింది. అతని చెవిలో వెంట్రుకలు ఎందుకు పెరిగాయా అని ఆలోచిస్తూ గూగుల్ లో సెర్చ్ చేస్తుంటే.. టెస్టోస్టెరాన్ అధికంగా రిలీజ్ కావడం వల్లే ఇలా వస్తాయని తేలినట్లు చెప్పింది. ఈ టెస్టోస్టెరాన్ ఓ లైంగిక హార్మోన్. అంటే పరోక్షంగా చిట్టిబాబును సమంత తిట్టింది.

ఇక ఇప్పుడు దీనిపై అతడు కూడా మరోసారి ఘాటుగా స్పందించాడు. తన చెవుల్లోనే కాదు.. శరీరంలో ఎక్కడెక్కడ వెంట్రుకలు పెరుగుతున్నాయో సమంత చూస్తున్నట్లుందని, దీనిపై ఓ అధ్యయనం చేసి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అనడం గమనార్హం. సినిమా విమర్శలు కాస్త వ్యక్తిగతంగా మారిపోయి, అది కూడా ఎక్కడెక్కడో వెంట్రుకల వరకూ వెళ్లడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం