Samantha Hospital Visit: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సమంత.. సినిమాలకు బ్రేక్ ఇస్తుందా? ఫొటోలు వైరల్-samantha ruth prabhu shares pics from hospital visit its goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Hospital Visit: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సమంత.. సినిమాలకు బ్రేక్ ఇస్తుందా? ఫొటోలు వైరల్

Samantha Hospital Visit: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సమంత.. సినిమాలకు బ్రేక్ ఇస్తుందా? ఫొటోలు వైరల్

Maragani Govardhan HT Telugu
Apr 27, 2023 01:52 PM IST

Samantha Hospital Visit: సమంత తాజాగా తను షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు సామ్.. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని కనిపించింది. అంతేకాకుండా హైపర్ బేరిక్ థెరపీ గురించి తెలిసేలా గూగుల్ పేజ్ స్క్రీన్‌షాట్ షేర్ చేసింది.

సమంత మళ్లీ ఆసుపత్రిలో చేరిందా?
సమంత మళ్లీ ఆసుపత్రిలో చేరిందా?

Samantha Hospital Visit: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గతేడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. చాలా రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలోనే తిరిగి తన ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయి వరుసగా షూటింగుల్లో పాల్గొంటోంది. అంతేకాకుండా జిమ్‌లో చెమటోడుస్తూ సోషల్ మీడియాలో ఆ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా ద్వారా పంచుకుంది. ఇందులో 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుటి తన ఫొటోను మొదట షేర్ చేయగా.. ఆ తర్వాత తన పెంపుడు కుక్కలు ఫొటోలను, ఆ తర్వాత ఆసుపత్రిలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నప్పటి ఫొటోను పెట్టింది.

అయితే ఆసుపత్రిలో ఫొటోను చూసిన సామ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ హాస్పిటల్‌లో చేరిందా? అని కంగారు పడుతున్నారు. అంతేకాకుండా మరో ఫొటోలో హైపర్‌బేరిక్ థెరపీ గురించి తెలిసేలా గూగుల్ సెర్చ్ పేజీ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. హైపర్ బేరిక్ థెరపీ అంటే ఏంటో ఆ స్క్రీన్ షాట్ ద్వారా తెలియజేసింది.

"హైపర్‌బేరిక్ థెరపీ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధులకు శక్తిమంతమైన సాధనంగా ఉంపయోగపడుతుంది. న్యూరో డీజెనరేటివ్ అనే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీని వల్ల ఆటిజం, ఇన్‌ఫ్లామేషన్, ఇన్‌ఫెక్షన్లను తగ్గుతాయట. అంతేకాకుండా దెబ్బతిన్న కణాలను తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొస్తుంది" అని సామ్ తను షేర్ చేసి స్క్రీన్ షాట్‌లో పేర్కొంది.

సామ్ ఈ ఫొటోలను షేర్ చేయడంతో సమంత మళ్లీ ఆసుపత్రిలో జాయిన్ అయిందా? షూటింగులకు మళ్లీ బ్రేక్ ఇస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇంకా తను ఆరోగ్యం పూర్తిగా సెట్ అవ్వలేదని, స్టైల్ కోసం ఇలా కళ్లద్దాలు పెట్టుకోవడం లేదని, తాను లైట్‌ను కూడా భరించలేకపోతున్నట్లు ఇటీవల శాకుంతలం ప్రమోషన్లలో సమంత వివరించిన సంగతి తెలిసిందే.

మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారం శాకుంతలం మూవీని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించారు. భరతుడిగా అల్లు అర్హ నటించింది. వీరితో పాటు మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కుమార్తే అల్లు అర్హ ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది.

Whats_app_banner