తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Nayanthara: సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. ఇలా కూడా పంపిస్తారా?

Samantha Nayanthara: సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. ఇలా కూడా పంపిస్తారా?

Sanjiv Kumar HT Telugu

12 October 2023, 9:52 IST

google News
  • Nayanthara Gift To Samantha: సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార, స్టార్ హీరోయిన్ సమంత మంచి స్నేహితులు. తాజాగా సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సమంత.

సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. ఇలా కూడా పంపిస్తారా?
సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. ఇలా కూడా పంపిస్తారా?

సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. ఇలా కూడా పంపిస్తారా?

Samantha On Nayanthara Gift: సౌత్ ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్‌గా నయనతార వెలుగొందితే.. స్టార్ హీరోయిన్‌గా సమంత రాణిస్తోంది. ఈ ఇద్దురు ముద్దుగుమ్మలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీసుతో సామ్ క్రేజ్ తెచ్చుకుంటే.. జవాన్ మూవీతో ఆరంభంలోనే సాలిడ్ హిట్ కొట్టింది నయనతార. అయితే వీరిద్దరూ రియల్ లైఫ్‌లో చాలా మంచి స్నేహితులు అని తెలిసిందే.

తాజాగా సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. హీరోయిన్లు ఈ మధ్య కాలంలో సినిమాలకే పరిమితం కాకుండా పలు వ్యాపారాలు, సినిమాలు నిర్మించడం చేస్తున్నారు. అలా నయనతార కూడా సొంతంగా వ్యాపారం చేస్తోంది. ఇటీవలే తన కొత్త వెంచర్‌ను ప్రారంభించింది నయన్. 9 స్కిన్ అనే బ్యూటి కేర్ ప్రాడక్ట్స్ ఉత్పత్తుల సంస్థను స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన కాస్మోటిక్స్ ఇండియాతోపాటు మలేషియా, సింగపూర్‌లలో కూడా అమ్ముతున్నారు.

కొత్త కంపెనీ కావడంతో నయన్ వాటిని బాగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే తన స్నేహితురాలికి నయనతార 9 స్కిన్ నుంచి బేస్ క్రీమ్ కాస్మోటిక్స్ గిఫ్టుగా పంపి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది సామ్. ఈ ఉత్పత్తులు అమెజింగ్‌గా ఉన్నాయి. వీటిని వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. థ్యాంక్యూ నయనతార. 9 స్కిన్‌కి ఆల్ ది వెరీ బెస్ట్ అని సమంత పోస్టులో రాసుకొచ్చింది.

అయితే, తన ఫ్రెండ్‌షిప్ కొద్ది సమంతకు నయన్ గిఫ్ట్ పంపినా.. అది ప్రచారంలో భాగం కావడంతో ఇలా కూడా గిఫ్ట్స్ ఇస్తారా అని నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే నయనతార, సమంత ఇద్దరూ కన్మణి రాంబో ఖతీజ (తమిళంలో కాతు వాకుల రెండు కాదల్) సినిమాతో మంచి స్నేహితులయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా చేసిన ఈ సినిమాకు నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నయన్ జవాన్ మూవీతో హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. సామ్ ఖుషి సినిమాతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

నయనతార ఇచ్చిన గిఫ్టుపై సమంత రియాక్షన్
తదుపరి వ్యాసం