Nayanthara: జవాన్ డైరెక్టర్ అట్లీపై నయనతార ఫైర్.. పరువు నష్టం దావా! ఎందుకంటే?-nayanthara files defamation case against regarding jawan director atlee rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara: జవాన్ డైరెక్టర్ అట్లీపై నయనతార ఫైర్.. పరువు నష్టం దావా! ఎందుకంటే?

Nayanthara: జవాన్ డైరెక్టర్ అట్లీపై నయనతార ఫైర్.. పరువు నష్టం దావా! ఎందుకంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2023 09:02 AM IST

Nayanthara Defamation Case: సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార ఇటీవల జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే జవాన్ సినిమా దర్శకుడు అట్లీపై నయనతార అసంతృప్తిగా ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

జవాన్ డైరెక్టర్ అట్లీపై నయనతార ఫైర్.. పరువు నష్టం దావా! ఎందుకంటే?
జవాన్ డైరెక్టర్ అట్లీపై నయనతార ఫైర్.. పరువు నష్టం దావా! ఎందుకంటే?

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, సౌత్ బ్యూటిఫుల్ లేడి సూపర్ స్టార్ నయనతార తొలిసారిగా కలిసి నటించిన చిత్రం జవాన్. షారుక్ ఖాన్ డ్యుయెల్ రోల్ పోషించిన ఈ సినిమాకు ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అటు అట్లీ.. ఇటు నయనతార ఇద్దరూ బాలీవుడ్‍కు పరిచయం అయ్యారు. అంతేకాకుండా తొలి సినిమాతోనే హిందీలో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ మూవీ వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పలు రికార్డులు క్రియేట్ చేసింది.

మరో హీరోయిన్‍గా

జవాన్ సినిమాలో నయనతార, షారుక్ ఖాన్‍తోపాటు బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, రిధి డోగ్రా, బిగ్ బాస్ సిరి హన్మంతు, యోగిబాబు, సంజయ్ దత్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో విలన్‍గా విజయ్ సేతుపతి చేయగా.. మరో హీరోయిన్‍గా దీపికా పదుకొణె మెరిసింది. తండ్రి పాత్రలో ఉన్న షారుక్ ఖాన్‍కు భార్యగా దీపికా నటించింది.

అట్లీపై అసంతృప్తి

జవాన్ సెకండాఫ్‍లో వచ్చే దీపిక పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక నయనతార రోల్ కూడా స్టైలిష్‍గా, పవర్‍ఫుల్‍గా ఉంది. కానీ, తనకన్నా దీపికాకే ఎక్కువ పేరు వచ్చిందని, తన పాత్రను తక్కువ చేసి అట్లీ చూపించడాని నయనతార చాలా కోపంగా, అసంతృప్తితో ఉందని ఇటీవల తమిళ మీడియాలో తెగ వార్తు వచ్చాయి. యూట్యూబ్ ఛానెళ్లు అయితే తమ క్రియేటివిటీ చూపించాయి. దీంతో అట్లీతో మరోసారి నయన్ సినిమా చేయదని కూడా రాసేశారు.

పరువు నష్టం దావా

తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వచ్చిన వార్తలపై తెగ సీరియస్ అయిందట నయనతార. వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనుందట. అట్లీపై తనకు కోపం ఉందని అసత్య వార్తలు, రాసిన, చూపించినా వారందరిపైనా నయనతార పరువు నష్టం దావా వేయనున్నట్లు టాక్ వస్తోంది. అంతేకాకుండా అట్లీ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తనను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. దీంతో నయన్, అట్లీ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చింది.