Shahrukh Khan Dupe: 15 ఏళ్లుగా షారుక్ ఖాన్‍‍కు డూప్.. రోజుకు ఎంత తీసుకుంటాడో తెలుసా?-shahrukh khan dupe prashant walde remuneration for jawan and daily charge ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shahrukh Khan Dupe: 15 ఏళ్లుగా షారుక్ ఖాన్‍‍కు డూప్.. రోజుకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Shahrukh Khan Dupe: 15 ఏళ్లుగా షారుక్ ఖాన్‍‍కు డూప్.. రోజుకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Sep 10, 2023 12:51 PM IST

Shahrukh Khan Dupe Remuneration: సినీ హీరోల డ్సాన్స్ సంగతి ఎలా ఉన్నా యాక్షన్ సీక్వెన్స్ లలో హీరోలకు డూప్‍లు ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జవాన్ మూవీతో హిట్ కొట్టిన షారుక్ ఖాన్ డూప్‍ పారితోషికం ఇంట్రెస్టింగ్‍గా మారింది.

15 ఏళ్లుగా షారుక్ ఖాన్‍‍కు డూప్
15 ఏళ్లుగా షారుక్ ఖాన్‍‍కు డూప్ (Instagram)

సినీ కథనాయకులు డ్యాన్స్ స్టెప్పులతో క్లాప్స్ కొట్టించడమే కాకుండా అదిరిపోయే ఫైట్లతో విజిల్స్ వేయిస్తారు. అలా బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గత కొన్నేళ్లుగా అభిమానులను, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు సుమారు 15 ఏళ్లుగా ఒకరు డూప్‍గా నటిస్తున్నాడు. ఇటీవల షారుక్ ఖాన్ నటించిన సినిమా జవాన్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలైన బీభత్సమైన పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా అందులో షారుక్ ఫైటింగ్ సీక్వెన్స్ అదిరిపోయాయని టాక్ వస్తోంది.

రెండు గెటప్స్

జవాన్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో షారుక్ ఖాన్‍కు డూప్‍గా నటించింది ప్రశాంత్ వాల్దే. జవాన్‍లో షారుక్ డ్యూయెల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో తండ్రీకొడుకులుగా షారుక్ చేశాడు. దానికి సంబంధించిన విషయం గురించి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రశాంత్. షారుక్, తాను రెండు వేర్వేరు గెటప్స్ వేసి కష్టపడాల్సి వచ్చినట్లుగా తెలిపాడు.

క్లోజప్ షాట్స్

"జవాన్ సినిమాలో తండ్రిని కుమారుడు ఆత్మీయంగా హత్తుకునే సీన్ ఉంది. అది చేసేటప్పుడు షారుక్ కొడుకు గెటప్ వేస్తే.. నేను తండ్రి పాత్ర చేశా. నన్ను కౌగిలించుకునే సమయంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. నేను కొడుకు గెటప్ వేస్తే.. షారుక్ ఓల్డ్ గెటప్ వేశారు. అప్పుడు తండ్రి క్లోజప్ షాట్స్ తీశారు. మేము ఇద్దరం ఒకేరోజు రెండు వేర్వేరు గెటప్స్, లుక్స్ మార్చాల్సి వచ్చింది" అని ప్రశాంత్ వాల్దే పేర్కొన్నాడు.

డూప్ పారితోషికం

ఇదిలా ఉంటే ఇలా షారుక్ ఖాన్‍కు 2007 నుంచి డూప్‍గా నటిస్తున్నాడు ప్రశాంత్ వాల్దే. అందుకు ప్రశాంత్ రోజుకు రూ. 30 వేల వరకు పారితోషికం తీసుకుంటాడ. అంటే నెలకు సుమారుగా రూ. 9 లక్షలు. ఇక జవాన్ సినిమాకు రూ. 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లుగా ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇలా షారుక్ ఖాన్‍కు డూప్‍గా నటిస్తూ ఎంతో కాలంగా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రశాంత్ వాల్దే.

వసూళ్లు

కాగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. ఇందులో లేడి సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ హాట్ బ్యూటి దీపిక పదుకొణె, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సాన్య మల్హోత్రా, రిద్ధి డోగ్రా కీలక పాత్రలు పోషించారు. షారుక్ సొంత బ్యానర్‍ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‍మెంట్‍లో నిర్మించిన జవాన్ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‍లో చేరింది.