షారుక్ ఖాన్, నయనతార జోడీ కట్టిన జవాన్ మూవీ తొలి రోజు సెప్టెంబర్ 7న రూ. 129 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి వంద కోట్ల క్లబ్‍లో చేరింది. తర్వాత వారం రోజుల వరకు కలెక్షన్స్ బాగానే వసూళు అయ్యాయి. కానీ, అనంతరం జవాన్ వసూళ్ల వరద తగ్గుముఖం పట్టింది. జవాన్ సినిమాకు 9వ రోజున తెలుగులో రూ. కోటిన్నర వరకు గ్రాస్ కలెక్ట్ అయినట్లుగా సమాచారం.
పాపులర్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ తొలిసారి హీరోగా చేసిన సినిమా జవాన్. దీంతో మూవీపై ఆది నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అలానే సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద బాగానే హోల్డే చేసుకుంటూ వచ్చింది. ఇలా జవాన్ మూవీకి వరల్డ్ వైడ్‍గా 9వ రోజున రూ. 21 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అలాగే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
షారుక్ ఖాన్ సినిమాలు విదేశాల్లో కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అందుకే అక్కడ కూడా కలెక్షన్స్ బాగానే వస్తుంటాయి. అలా ఓవర్సీస్‍లో జవాన్ సినిమాకు 9 రోజులకు రూ. 240.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 410. 88 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 730 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలిగింది. దీంతో అతి వేగంగా రూ. 400 కోట్ల నెట్, రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న హిందీ మూవీగా జవాన్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక జవాన్ సినిమాకు రూ. 300 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 వేల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ. 300 కోట్ల నెట్ టార్గెట్‍తో బరిలోకి దిగింది. సినిమాకు 9 రోజుల్లో రూ. 410.88 కోట్లు రావడంతో నిర్మాత గౌరీ ఖాన్‍కు రూ. 110.88 కోట్లు లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.