Samantha Naga Chaitanya: మళ్లీ కలవనున్న నాగ చైతన్య-సమంత.. పెంపుడు కుక్కతో ప్రూఫ్-samantha naga chaitanya reunion news by pet dog haash photo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Naga Chaitanya: మళ్లీ కలవనున్న నాగ చైతన్య-సమంత.. పెంపుడు కుక్కతో ప్రూఫ్

Samantha Naga Chaitanya: మళ్లీ కలవనున్న నాగ చైతన్య-సమంత.. పెంపుడు కుక్కతో ప్రూఫ్

Sanjiv Kumar HT Telugu
Oct 09, 2023 04:27 PM IST

Samantha Naga Chaitanya Reunion: విడిపోయి ఇన్నేళ్లు అవుతున్న నాగ చైతన్య, సమంత జోడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. వాళ్లిద్దరు మళ్లీ కలిస్తే బాగుండు అని కోరుకునే వాళ్లు లేరు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫొటో సమంత, చైతూ ఒక్కటి కానున్నట్లు తెలుపుతోంది.

మళ్లీ కలవనున్న నాగ చైతన్య-సమంత.. పెంపుడు కుక్కతో ప్రూఫ్
మళ్లీ కలవనున్న నాగ చైతన్య-సమంత.. పెంపుడు కుక్కతో ప్రూఫ్

Samantha Naga Chaitanya Patch Up: 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయాల ప్రకారం, మరుసటి రోజు క్రైస్తవ ఆచార పద్ధతిలో పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత నాలుగేళ్లకు విడిపోయి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి కారణాల సంగతి ఎలా ఉన్నా వాళ్లు మళ్లీ కలవాలని కోరుకోని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ నేపథ్యంలోనే సామ్, చై మళ్లీ కలిసిపోతున్నట్లు గత కొంతకాలంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, తాజాగా వాటన్నింటికి కొద్దిగా బలం చేకూరేలే ఓ ఫొటో దర్శనం ఇచ్చింది.

తనతోపాటే

సమంత దగ్గర రెండు పెంపుడు కుక్కలు హాష్, షాష్ ఉన్నాయి. అందులో హాష్ నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి ఉన్నప్పటి నుంచి ఉంది. అది సామ్, చై ఇద్దరికి చాలా క్లోజ్. వాటితో కలిసి వారిద్దరు చాలా సందర్భాల్లో దిగిన ఫొటోలు అప్పట్లో వైరల్ కూడా అయ్యాయి. విడాకుల తర్వాత హాష్‌ను తనతోపాటే తీసుకెళ్లింది సమంత. దానికి సంబంధించిన పిక్స్ సైతం షేర్ చేసింది సామ్. అయితే సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య దగ్గర హాష్ తొలిసారిగా కనిపించడం ఆశ్చర్యంగా మారింది.

వెనుక నుంచి

ఇటీవల ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కుని చైతూని కలవడానికి వెళ్లాడు. అక్కడ చైతూతో హాష్ కూడా కనిపించింది. తాజాగా మరోసారి సమంత కుక్కు పిల్ల హాష్ నాగ చైతన్య దగ్గర కనిపించింది. స్వయంగా చైతూనే హాష్ పిక్ తీసి ఇన్ స్టాలో షేర్ చేశాడు. సాయంత్రం సమయంలో కారులో నుంచి సూర్యుడిని చూస్తున్న హాష్‌ను వెనుక నుంచి తీసిన ఫొటోను చై పంచుకున్నాడు. దీనికి వైబ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పిక్ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

హాష్ కోసమైనా

నాగ చైతన్య దగ్గర సమంత కుక్కు పిల్ల హాష్‌ను చూసిన నెటిజన్లు వాళ్లిద్దరు మళ్లీ కలవబోతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "మీరు సమంతతో ప్యాచప్ అయ్యారా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే "బహుశా సమంత ఆస్ట్రియా ట్రిప్‌కు వెళ్లేముందు హాష్‌ను చైతూ దగ్గర విడిచిపెట్టి ఉంటుంది" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. "మీరు హాష్ కోసమైనా ప్యాచప్ అవ్వండి" అని మరొకరు అన్నారు. ఇలా పెంపుడు కుక్క హాష్ ఫొటోతో చైసామ్ కలవనున్నట్లు టాక్ నడుస్తోంది.

Whats_app_banner