తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha At Pazhani Murugan Temple: ప‌ళ‌ని టెంపుల్‌లో స‌మంత ప్ర‌త్యేక పూజ‌లు - ఫొటోలు వైర‌ల్‌

Samantha At Pazhani Murugan Temple: ప‌ళ‌ని టెంపుల్‌లో స‌మంత ప్ర‌త్యేక పూజ‌లు - ఫొటోలు వైర‌ల్‌

14 February 2023, 13:57 IST

google News
  • Samantha At Pazhani Murugan Temple: త‌మిళ‌నాడులోని ప‌ళ‌ని మురుగ‌న్ టెంపుల్‌లో సోమ‌వారం హీరోయిన్ స‌మంత ప్ర‌త్యేక పూజ‌లు చేసింది.  ప‌ళ‌ని టెంపుల్‌ను స‌మంత సంద‌ర్శించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

స‌మంత
స‌మంత

స‌మంత

Samantha At Pazhani Murugan Temple: మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డిన స‌మంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తిరిగి పూర్వ‌పు జీవితంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ది. మ‌యోసైటిస్ కార‌ణంగా సినిమా షూటింగ్‌ల‌కు గ్యాప్ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో చాలా రోజుల పాటు క‌నిపించ‌ని ఆమె ఇటీవ‌లే యాక్టివ్‌గా మారింది. వ‌ర్క‌వుట్ ఫొటోల‌ను పోస్ట్‌చేసింది.

తాజాగా సోమ‌వారం స‌మంత‌ త‌మిళ‌నాడులోని ప‌ళ‌ని మురుగ‌న్‌ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసింది. మెట్ల మార్గం ద్వారా కొండ‌పైకి చేరుకున్న‌ది స‌మంత‌. అంతే కాకుండా ఒక్కో మెట్టు వ‌ద్ద హార‌తిని వెలుగించుకుంటూ వెళ్లింది. మొత్తం ఆరు వంద‌ల మెట్ల‌కు హార‌తిని వెలిగించి పూజ‌లు నిర్వ‌హించింది.

స‌మంత ప‌ళ‌ని టెంపుల్‌లో పూజ‌లు నిర్వ‌హిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌యోసైటిస్ నుంచి కోలుకోవ‌డంతోనే ప‌ళ‌ని టెంపుల్‌లో స‌మంత‌ పూజ‌లు నిర్వ‌హించిన‌ట్లు చెబుతున్నారు. కొద్ది నెల‌ల క్రితం మ‌యోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం స‌మంత అమెరికా వెళ్లింది. ప్ర‌స్తుతం ట్రీట్‌మెంట్‌ను కొన‌సాగిస్తోన్న స‌మంత ఐవీఐజీ ఇంజెక్ష‌న్స్ తీసుకుంటున్న ఫొటోల‌ను ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ప్ర‌జెంట్‌ స‌మంత తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషి సినిమాలో న‌టిస్తోంది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. అలాగే స‌మంత తొలిసారి పౌరాణిక క‌థాంశంతో చేసిన శాకుంత‌లం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. వీటితో పాటుగా హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది స‌మంత‌.

తదుపరి వ్యాసం