Vijay Deverakonda Kushi Update: ఖుషి షూటింగ్‌కు ఆల్ సెట్ - మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ
Vijay Deverakonda Kushi Update: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ఖుషి సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను డైరెక్టర్ శివ నిర్వాణ రివీల్ చేశాడు. ఆ అప్‌డేట్ ఏదంటే...
Vijay Deverakonda Kushi Update: ఖుషి అప్‌డేట్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించిన దర్శకుడు శివ నిర్వాణ తాజాగా మరో అప్‌డేట్ రివీల్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.
ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు ప్రకటించాడు. హీరో విజయ్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ హీషమ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి దిగిన ఫొటోను శివ నిర్వాణ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆల్ సెట్ టూ కిక్‌స్టార్ట్ అంటూ ట్వీట్ చేశాడు. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు శివనిర్వాణ పేర్కొన్నాడు.
ఖుషి సినిమాతోనే హీషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హీషమ్ సంగీతాన్ని అందించిన మలయాళ సినిమా హృదయంలోని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
త్వరలో షూటింగ్ షురూ
కశ్మిర్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా ఖుషి సినిమా తెరకెక్కుతోంది. గత డిసెంబర్‌లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ బారిన పడటంతో షూటింగ్ వాయిదాపడింది.
త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సమంత కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు ఇటీవలే ప్రకటించింది. కంటిన్యూగా కొత్త షెడ్యూల్స్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం. మహానటి తర్వా త విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.