Sai Durga Tej: మెగా హీరో పాన్ ఇండియన్ మూవీకి ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఇన్స్ఫిరేషన్ అంట!
26 October 2024, 17:03 IST
Sai Durga Tej: బ్రో మూవీ తర్వాత రోహిత్ అనే దర్శకుడిగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తోన్నాడు మెగా హీరో సాయిదుర్గాతేజ్. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ 300 స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోన్నట్లు ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సాయిదుర్గాతేజ్ చెప్పాడు.
సాయిదుర్గాతేజ్
Sai Durga Tej: సాయిధరమ్‌తేజ్ హీరోలుగా నటించిన విరూపాక్ష, బ్రో రెండు సినిమాలు వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. విరూపాక్ష మూవీ నిర్మాతలకు రెండింతల లాభాలు తెచ్చిపెట్టగా...బ్రో మోస్తారు లాభాలను సాధించింది. బ్రో తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సాయిదుర్గాతేజ్ రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయిదుర్గాతేజ్ తన నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాల్ని వెల్లడించారు.
హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో...
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ 300 స్ఫూర్తితో ఈ మూవీ చేయబోతున్నట్లు సాయిదుర్గాతేజ్ చెప్పాడు. తన కెరీర్‌లో హయ్యెస్ట్‌బ డ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. . తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించే మూవీగా ఇది నిలుస్తుందనే నమ్మకముందని అన్నాడు. ఈ సినిమా షూటింగ్ 30 శాతం వరకు పూర్తయినట్లు చెప్పాడు
హనుమాన్ ప్రొడ్యూసర్లు...
ఎస్‌డీటీ 18 అనే వర్కింట్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.హనుమాన్‌తో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొన్న నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఎస్‌డీటీ 18 మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నారు.
పాన్ ఇండియన్ లెవెల్‌లో...
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఎస్‌డీటీ 18తో పాటు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో సాయిదుర్గాతేజ్ మిస్టీక్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ప్రశ్నించడం ఆపను...
ఏబీసీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సాయిదుర్గాతేజ్‌తో పాటు సీనియర్ సినీ నటులు ప్రకాష్ రాజ్, గౌతమి పాల్గొన్నారు. బాలచందర్, కృష్ణవంశీ, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు ఇచ్చిన అవకాశాలే తాను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు ఈ ఈవెంట్‌లో ప్రకాష్‌రాజ్ చెప్పాడు. కమర్షియల్, ఆర్ట్ అనే భేదాలు తనకు లేవని, కథ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తానని అన్నాడు.
టాలెంట్‌తో పాటు ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ వల్లే తాను నటుడిగా ఇన్నేళ్లైనా ఇండస్ట్రీలో కొనసాగుతోన్నానని చెప్పాడు. గళం వినిపించలేని ప్రజలకు గొంతుకగా ఉంటా. తప్పులను చూస్తూ నేరు మెదపకుండా ఉండలేను. సినిమా అవకాశాలు కోల్పోయిన ప్రశ్నించడం మాత్రం మానను. నా ఎన్ని కుట్రలు చేసిన తట్టుకొని నిలబడ్డాను. ఇకపై కూడా నిలబడతానుఅని ప్రకాష్ రాజ్ అన్నాడు.