Love Mocktail 2 OTT: లవ్ మాక్ టెయిల్ 2 కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ 21 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ లవ్ మాక్ టెయిల్ 2 పేరుతోనే ఈ ఏడాది తెలుగులోకి డబ్ అయ్యింది. కన్నడ ఒరిజినల్ వెర్షన్ సూపర్ హిట్‌గా నిలవగా...తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
జూన్ నెలలో తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత లవ్ మాక్ టెయిల్ 2 తెలుగులో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 31 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తూ లవ్ మాక్ టెయిల్ 2కు దర్శకత్వం వహించాడు. మిలినా నాగరాజ్, అమృత అయ్యంగార్, రచల్ డేవిడ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సింగర్ నకుల్ అభయంకర్ మ్యూజిక్ అందించాడు. 2020లో కన్నడంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన లవ్ మాక్ టెయిల్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. హీరోయిన్ మిలినా నాగరాజ్‌తో కలిసి డార్లింగ్ కృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
లవ్ మాక్ టెయిల్ 2లో హీరోహీరోయిన్లుగా నటించిన డార్లింగ్ కృష్ణ, మిలినా నాగరాజ్ రియల్‌లైఫ్‌లో భార్యాభర్తలు కావడం గమనార్హం. లవ్ మాక్‌టెయిల్‌లో వీరిద్దరు జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డ డార్లింగ్ కృష్ణ, మిలినా నాగరాజ్ పెళ్లి చేసుకున్నారు.
లవ్ మాక్‌టెయిల్‌కు కొనసాగింపుగా డార్లింగ్ కృష్ణ లవ్ మాక్ టెయిల్ 2ను తెరకెక్కించాడు. చనిపోయిన భార్య నిధి (మిలినా నాగరాజ్) ఆలోచనలు ప్రతిక్షణం ఆది(డార్లింగ్ కృష్ణ)ని వెంటాడుతుంటాయి. భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ మాట్లాడుతుంటాడు.
అనుకోకుండా ఆదికి ఓ లెటర్ వస్తుంది. ఆ లెటర్ కారణంగా ఆది జీవితంలోకి జకానా(సుష్మిత గౌడ), సిహి(రచేల్ డేవిడ్) అనే అమ్మాయిలు వస్తారు. వారి పరిచయం ఆదిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది. నిధిని అతడు మర్చిపోయాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
లవ్ మాక్ టెయిల్ మూవీ తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ అయ్యింది. ఈ రీమేక్‌లో తమన్నా, సత్యదేవ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
టాపిక్