తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr For Oscars: ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రాజమౌళి రూ.50 కోట్లు ఖర్చు!

RRR for Oscars: ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రాజమౌళి రూ.50 కోట్లు ఖర్చు!

HT Telugu Desk HT Telugu

24 November 2022, 19:06 IST

    • RRR for Oscars: ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రాజమౌళి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టగా.. ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఆశ్చర్యం కలిగిస్తోంది.
స్టార్ వార్స్ డైరెక్టర్ అబ్రామ్స్ తో రాజమౌళి
స్టార్ వార్స్ డైరెక్టర్ అబ్రామ్స్ తో రాజమౌళి

స్టార్ వార్స్ డైరెక్టర్ అబ్రామ్స్ తో రాజమౌళి

RRR for Oscars: టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన చారిత్రక మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత అటు హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. ఈసారి ఇండియా నుంచి ప్రతిష్టాత్మక ఆస్కార్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తుందని అందరూ భావించారు.

ట్రెండింగ్ వార్తలు

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

కానీ మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ మాత్రం దక్కలేదు. దీంతో రాజమౌళి నేరుగా ఆస్కార్స్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ను నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ఈ మధ్యే ఆస్కార్స్‌కు ముందు జరిగే గవర్నర్స్‌ అవార్డ్స్‌లోనూ పాల్గొన్నాడు. ఇప్పటికే అమెరికా, జపాన్‌లలో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్‌ చేశాడు. ఇక ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్స్‌కు నామినేట్‌ చేయడానికి అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ప్రొఫెషనల్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు.

ఆస్కార్స్‌లో కొన్ని సినిమాలను ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఇప్పుడీ రూట్‌లోనే రాజమౌళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ ఓట్లను అకాడెమీలోని 10 మంది ప్రొఫెషనల్స్‌ వేస్తారు. వీళ్ల కోసమే ఆర్‌ఆర్ఆర్‌ స్పెషల్‌ షోలను రాజమౌళి ఏర్పాటు చేస్తున్నాడు. వీటి కోసం అతడు ఏకంగా రూ.50 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నాడని తాజాగా వార్తలు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ అకాడెమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ఉన్న 10 వేల మంది సినిమాలో వివిధ ఆర్ట్స్‌కు చెందిన వాళ్లు. వీళ్లంతా ప్రొఫెషనల్స్‌. వివిధ సినిమాలను ఆస్కార్స్‌కు ఓటింగ్‌ ద్వారా పంపించడమే వీళ్ల పని. అందుకే రాజమౌళి రూట్‌లో వెళ్తున్నాడు. మరి అతని ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయి? మన ప్రతిష్టాత్మక ఆర్ఆర్‌ఆర్ మూవీ ఆస్కార్స్‌కు నామినేట్‌ అవుతుందా లేదా చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.