Star Wars director on RRR: ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి వీరాభిమానిని.. రాజమౌళిని కలిసిన స్టార్ వార్స్ డైరెక్టర్
Star Wars director on RRR: ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి వీరాభిమానినని చెప్పాడు స్టార్ వార్స్ డైరెక్టర్ జేజే అబ్రామ్స్. అంతేకాదు అతడు మన దర్శక ధీరుడు రాజమౌళిని కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.
Star Wars director on RRR: ఆర్ఆర్ఆర్ మూవీ వీరాభిమానుల ఖాతాలో మరో సెలబ్రిటీ చేరాడు. ఈసారి అలాంటిలాంటి సెలబ్రిటీ కాదు. ఏకంగా హాలీవుడ్‌లో మిషన్ ఇంపాజిబుల్ III, స్టార్ వార్స్‌లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జేజే అబ్రామ్సే తాను ఆర్‌ఆర్‌ఆర్‌కు పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. అంతేకాదు అతడు మన జక్కన్న, దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి కెమెరాలకు పోజులిచ్చాడు.
ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విటర్ ఈ ఫొటోను షేర్ చేసింది. "ఆర్ఆర్‌ఆర్ మూవీ చరిష్మా కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ మేకర్, స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్‌లాంటి ఎన్నో మరుపురాని మూవీస్‌ను డైరెక్ట్ చేసిన జేజే అబ్రామ్స్ కూడా తాను ఆర్‌ఆర్‌ఆర్‌కు పెద్ద అభిమానిని అని చెప్పాడు. గవర్నర్స్ అవార్డ్స్‌లో అతడు రాజమౌళిని కలవడం సంతోషంగా ఉంది" అని ట్వీట్ చేసింది.
ఆస్కార్స్‌కు ముందు జరిగే వేడుక అయిన గవర్నర్స్ అవార్డ్స్ వేడుకకు రాజమౌళి కూడా వెళ్లడం విశేషం. ఆ అవార్డుల్లోనే అబ్రామ్స్‌ను రాజమౌళి కలిశాడు. తన తనయుడు కార్తికేయతో కలిసి రాజమౌళి సూటుబూటు వేసుకొని ఈ అవార్డుల వేడుకకు హాజరయ్యాడు. అబ్రామ్స్‌తో కలిసి రాజమౌళి దిగిన ఫొటోను చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
రాజమౌళి ఇప్పుడు నిజంగానే అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడని కొందరు కామెంట్స్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఇండియా తరఫున అధికారికంగా ఆస్కార్స్‌కు వెళ్తుందని భావించినా.. ఛెల్లో షోకు ఆ అవకాశం దక్కింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ నేరుగా అకాడెమీ అవార్డుల రేసులో నిలిచింది. అందులో భాగంగానే ఇప్పుడు అంతకుముందు జరిగే గవర్నర్స్ అవార్డుల సెర్మనీలో రాజమౌళి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఆర్‌ఆర్‌ఆర్.. ఈ మధ్యే జపాన్‌లోనూ రిలీజై వసూళ్ల రికార్డు సాధించింది. రామ్‌భీమ్‌గా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత హాలీవుడ్‌లోనూ అభిమానులు అయ్యారు. అందులో భాగంగానే అబ్రామ్స్‌లాంటి ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.