Mahesh Babu Rajamouli Movie: మహేష్‌, రాజమౌళి సినిమా 2023లోనూ ప్రారంభం కాదా?-mahesh babu rajamouli movie may not go on sets in 2023 too as the director needs more time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Rajamouli Movie: మహేష్‌, రాజమౌళి సినిమా 2023లోనూ ప్రారంభం కాదా?

Mahesh Babu Rajamouli Movie: మహేష్‌, రాజమౌళి సినిమా 2023లోనూ ప్రారంభం కాదా?

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 08:15 PM IST

Mahesh Babu Rajamouli Movie: మహేష్‌, రాజమౌళి సినిమా 2023లోనూ ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. తాజాగా వస్తున్న అప్‌డేట్‌ మహేష్ అభిమానులను ఒకింత నిరాశకు గురి చేయనుంది.

రాజమౌళి, మహేష్ బాబు
రాజమౌళి, మహేష్ బాబు

Mahesh Babu Rajamouli Movie: ఎస్‌ఎస్‌ రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్‌, పాన్‌ ఇండియా డైరెక్టర్‌ కాదు. ఆర్‌ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్‌ లెవల్‌కు చేరిపోయాడు. అలాంటి డైరెక్టర్‌ తన తర్వాతి మూవీపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామూలుగానే అతడు తన ప్రతి సినిమాను ఎన్నో ఏళ్ల పాటు జాగ్రత్తగా చెక్కుతూ తీర్చిదిద్దుతాడు.

అందుకే అతనికి జక్కన్న అనే ముద్దు పేరు కూడా ఉంది. ఇక ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్‌ లెవల్‌ డైరెక్టర్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబును కూడా ఆ రేంజ్‌కు తీసుకెళ్లే మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఇండియాలో ఆర్‌ఆర్ఆర్‌ మూవీ సక్సెస్‌ తర్వాత దానిని అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లోనూ ప్రమోట్‌ చేస్తూ బిజీగా ఉన్న రాజమౌళి.. మరోవైపు మహేష్ మూవీ స్క్రిప్ట్ పనిలోనూ బిజీగా ఉన్నాడు.

ఈ ఏడాదంతా స్క్రిప్ట్‌, ప్రీప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి.. వచ్చే ఏడాది మహేష్‌తో మూవీ షూటింగ్‌ ప్రారంభించనున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న అప్‌డేట్‌ ప్రకారం.. ఈ మూవీ వచ్చే ఏడాది కూడా సెట్స్‌పైకి వెళ్లేది అనుమానంగా మారింది. ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజమౌళి.. తన స్క్రిప్ట్‌, ప్రీప్రొడక్షన్‌ పనుల కోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తున్నాడట.

ఇప్పటికే ఈ సినిమా కోసం పలు హాలీవుడ్‌ స్టూడియోలతో రాజమౌళి సంప్రదింపులు జరిపాడు. పైగా షూటింగ్‌ను వివిధ దేశాల్లో చేయడానికి కూడా ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో ఎస్‌ఎస్‌ఎంబీ 29 మూవీ షూటింగ్‌ 2023లోనూ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ విషయాన్ని మహేష్‌ బాబుకు రాజమౌళి చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

నిజానికి గతంలోనే ఈ ప్రాజెక్ట్‌ కోసం మూడేళ్లు కేటాయించాల్సిందేనని మహేష్‌కు జక్కన్న చెప్పాడు. బాహుబలి, ఆర్ఆర్‌ఆర్‌లను మించిన సినిమాను మహేష్‌తో తీస్తానని కూడా చెప్పిన రాజమౌళి.. దానికోసం భారీ స్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా మహేష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీగా నిలిచిపోతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

కేఎల్ నారాయణ ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎస్‌ఎస్‌ఎంబీ29 నిర్మితం కానుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ28 చేస్తున్న మహేష్‌కు ఆ తర్వాత కూడా రాజమౌళి సినిమాకు సిద్ధం కావడానికి చాలా సమయం లభించనుంది. మరి ఆ గ్యాప్‌లో అతడు మరో సినిమా తీస్తాడా లేక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తాడా అన్నది చూడాలి.

IPL_Entry_Point