Top Trending Releases in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండ్ అవుతున్న సిరీస్, చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి
Top Trending Releases in Netflix: ఇటీవల కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సిరీస్‌లు, చిత్రాల్లో మూడు టాప్ లో నిలిచాయి. వీటిలో 1899 సిరీస్, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం ఉంది. ప్రేక్షకులను సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి.
Top Trending Releases in Netflix: ఓటీటీలో ఏదైనా సిరీస్, మూవీ విడుదలవుతుందంటే.. విపరీతంగా బజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా యువతను ఓటీటీ సిరీస్‌లు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా విభిన్న రకాల కంటెంట్‌ను వీటి ద్వారా చూసే అవకాశం కలుగుతుంది. ఇంకా నెట్‌ఫ్లిక్స్ లాంటి అగ్రగామి ఓటీటీ సంస్థల్లో కంటెంట్‌కు లోటే ఉండదు. ఇటీవల కాలంలో కంటెంట్, కాస్ట్ విషయంలో విమర్శలు ఎదుర్కుంటోన్న నెట్‌ఫ్లిక్స్ ఎంతో మంది తన సబ్‌స్క్రైబర్లను దూరం చేసుకుంది. దీంతో ఈ రెండు విషయాల్లో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కంటెంట్ పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సిరీస్ 1899 ఆ కోవకే వస్తుంది. అంతేకాకుండా ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టి అక్కడి కంటెంట్‌ను తన వినియోగదారులకు చేరువచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో విడుదలై నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ట్రెండింగ్‌లో ఉన్న టాప్-3 ప్రాజెక్టుల గురించి ఇప్పుడు చూద్దాం.
1899..
జర్మన్ ఫిక్షన్ సిరీస్ 1899 గత వారమే(నవంబరు) నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులో వచ్చింది. ట్రైలర్ చూస్తేనే విభిన్న తరహాలో అనిపించిన ఈ సిరీస్.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లిస్టులో ముందు వరుసలో ఉంది. ఎమిలీ బీషమ్, అనియూరిన్ బెర్నార్డ్, ఆండ్రీస్ పీట్స్‌మన్, మిగేల్ బెర్ముడావ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియడ్ డ్రామా మిస్టరీ సూపర్ నేచరుల్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఆరంభంలో కాస్త నిదానంగా, కన్ఫ్యూజన్‌గా అనిపించినప్పటికీ రాను రాను ఆసక్తిని కలిగిస్తుంది. 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. బారన్ ఓ బోడర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది.
గాడ్‌ఫాదర్..
ఆచార్య పరాజయంతో డీలా పడిన మన మెగాస్టార్ చిరంజీవి.. గాడ్‌ఫాదర్ చిత్రంతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. గత నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలో మెరిసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ జాబితాలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మించారు.
కుమారి..
రీజనల్ కంటెంట్‌పై దృష్టి పెట్టిన నెట్‌ఫ్లిక్స్.. ఈ విషయంలో ముందుగా మలయాళం సినిమాలకు మొదట ఓటేస్తుంది. ఇందులో భాగంగా మలయాళ ఫాంటసీ చిత్రం కుమారి నవంబరు 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మైథాలాజికల్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో టాప్-3 ట్రెండింగ్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఐశ్వర్య లక్ష్మీ, షైన్ టామ్ చాకో, సురభి లక్ష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కంటెంట్ పరంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుందీ చిత్రం.
సంబంధిత కథనం