Godfather Streaming in OTT: ఓటీటీలోకి వచ్చిన గాడ్‌ఫాదర్.. ఎందులో అంటే?-megastar chiranjeevi godfather movie is streaming now in netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather Streaming In Ott: ఓటీటీలోకి వచ్చిన గాడ్‌ఫాదర్.. ఎందులో అంటే?

Godfather Streaming in OTT: ఓటీటీలోకి వచ్చిన గాడ్‌ఫాదర్.. ఎందులో అంటే?

Maragani Govardhan HT Telugu
Nov 19, 2022 01:34 PM IST

Godfather Streaming in OTT: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి
గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి

Godfather Streaming in OTT: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది రెండు సినిమాలతో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో ఆచార్య సినిమాతో సందడి చేసిన చిరు.. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గాడ్‌ఫాదర్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ అదరగొట్టింది. అయిత ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాలో ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముక ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గాడ్‌ఫాదర్ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబరు 19న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి గాడ్‌ఫాదర్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ సినిమా రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కుటుంబంతో కలిసి మరోసారి ఈ వీకెండ్‌కు ఇంట్లోనే కూర్చుని మరోసారి గాడ్‌ఫాదర్ చిత్రాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన గాడ్‌ఫాదర్ చిత్రం అదిరిపోయే వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొత్తం రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్లతో దుమ్మురేపింది. మెగాస్టార్ గత చిత్రం ఆచార్య ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోగా.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది.

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేసింది. తమన్ సంగీత సారథ్యం వహించగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మించారు.

సంబంధిత కథనం