Telugu News  /  Entertainment  /  Nayanthara Wedding Teaser Released On Saturday That Is On September 24th By Netflix
పెళ్లి సందర్భంగా నయనతార, విగ్నేష్ శివన్
పెళ్లి సందర్భంగా నయనతార, విగ్నేష్ శివన్ (HT_PRINT)

Nayanthara Wedding Teaser: నయనతార పెళ్లి టీజర్‌ రిలీజ్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌

24 September 2022, 17:08 ISTHT Telugu Desk
24 September 2022, 17:08 IST

Nayanthara Wedding Teaser: నయనతార పెళ్లి టీజర్‌ రిలీజ్‌ చేసింది గ్లోబల్‌ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌. ఆమె పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీని ఈ ఓటీటీ త్వరలోనే స్ట్రీమింగ్‌ చేయనుంది.

Nayanthara Wedding Teaser: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, డైరెక్టర్‌ విగ్నేష్‌ శివన్‌ పెళ్లి ఈ ఏడాది ఎంత బజ్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే. గత జూన్‌ 9వ తేదీన వీళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వీళ్ల పెళ్లి స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌.. తాజాగా శనివారం (సెప్టెంబర్‌ 24) టీజర్‌ను రిలీజ్‌ చేసింది. నయనతార.. బియాండ్‌ ద ఫెయిరీటేల్‌ టైటిల్‌తో వీళ్ల పెళ్లి డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇక శనివారం వచ్చిన టీజర్‌ ఈ ఫెయిరీటేల్‌ ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టింది. నిమిషం పాటు ఉన్న ఈ టీజర్‌.. వాళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని సీన్లను చూపించింది. పెళ్లి వీడియోలతోపాటు నయన్‌, విగ్నేష్‌ల ఇంటర్వ్యూలు కూడా ఇందులో ఉన్నాయి. నిజానికి మీడియా, సోషల్‌ మీడియా, మూవీ ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్‌.. తన పెళ్లి డాక్యుమెంటరీలో మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా మందిని అట్రాక్ట్‌ చేసింది.

ఆమె బయట మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే. దీంతో ఈ డాక్యుమెంటరీలో నయన్‌ ఇంటర్వ్యూ పార్ట్‌ హైలైట్‌గా నిలవనుంది. "నాకు ఈ టైటిల్‌, ట్యాగ్స్‌ అంటే ఏంటో అర్థం కాదు. ఇదంతా మొదలైనప్పుడు ఎలా ఉండబోతోందో నాకు అస్సలు తెలియదు. నేను ఫిల్మీ కిడ్‌ను కాదు. నేనొక సాధారణ అమ్మాయిని. తన భర్తకు తానేం చేసినా వంద శాతం ఇవ్వాలనుకునే అందరిలాంటి అమ్మాయిని" అని అందులో నయన్‌ చెప్పడం విశేషం.

ఇక తన భార్యను ఆకాశానికెత్తాడు విగ్నేష్‌ శివన్‌. ఆమె ఓ నటి కంటే ఎక్కువగా ఓ అద్భుతమైన మనిషి అని అతడు అన్నాడు. టీజర్‌లో చాలా వరకూ విగ్నేష్‌ మాత్రం తమిళంలోనే మాట్లాడాడు. ఇక ఈ టీజర్‌లో నయన్‌, విగ్నేష్‌ ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని ఉండటం, హగ్‌ చేసుకోవడం, పెళ్లికి రెడీ అవుతుండటంలాంటివి చూడొచ్చు. ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు స్ట్రీమ్‌ చేస్తుందో నెట్‌ఫ్లిక్స్‌ చెప్పలేదు. అయితే అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉంది.

టాపిక్