Rajinikanth on Godfather: గాడ్‌ఫాదర్‌ అద్భుతంగా ఉంది: రజనీకాంత్‌-rajinikanth on godfather says the movie is excellent and very interesting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajinikanth On Godfather Says The Movie Is Excellent And Very Interesting

Rajinikanth on Godfather: గాడ్‌ఫాదర్‌ అద్భుతంగా ఉంది: రజనీకాంత్‌

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 09:46 PM IST

Rajnikanth on Godfather: గాడ్‌ఫాదర్‌ మూవీ అద్భుతంగా ఉందని అన్నాడు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈ సినిమాపై అతడు ప్రశంసలు కురిపించినట్లు డైరెక్టర్‌ మోహన్‌ రాజా ట్వీట్‌ చేశాడు.

గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవి
గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవి

Rajnikanth on Godfather: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర అద్భుతమే చేసింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లపైన వసూలు చేసింది. ఆచార్య డిజాస్టర్‌ తర్వాత చిరుని మళ్లీ ఇండస్ట్రీలో నిలబెట్టిన మూవీగా గాడ్‌ఫాదర్‌ నిలిచింది. మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా.. సంచలన విజయం సాధించింది.

ఈ సినిమాను ఈ మధ్యే చూసిన తమిళ సూపర్‌ స్టార్‌, చిరంజీవి ఫ్రెండ్‌ రజనీకాంత్‌ కూడా గాడ్‌ఫాదర్‌పై ప్రశంసలు కురిపించాడు. సినిమా అద్భుతం, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని రజనీ అన్నట్లు ఈ మూవీ డైరెక్టర్‌ మోహన్‌ రాజా సోమవారం (అక్టోబర్‌ 10) ట్వీట్‌ చేశాడు. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌లో చిరంజీవి, సత్యదేవ్‌ల నటన చాలా మందికి నచ్చింది.

"సూపర్‌స్టార్‌ గాడ్‌ఫాదర్‌ను చూశాడు. అద్భుతం, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని ఈ సినిమా గురించి రజనీ చెప్పాడు. థ్యాంక్యూ సో మచ్‌ తలైవా రజనీకాంత్‌ సర్‌. నా జీవితంలోని అత్యుత్తమ క్షణాల్లో ఇదీ ఒకటి. ఇది నాకెంతో విలువైనది" అని మోహన్‌ రాజా ట్వీట్‌ చేశాడు.

ఈ సినిమాలో చిరంజీవితోపాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే అతడు కూడా గాడ్‌ఫాదర్‌ సక్సెస్‌కు సంబంధించి ఓ వీడియోను కూడా షేర్‌ చేశాడు. ఈ సినిమా కోసం సల్మాన్‌ అసలు రెమ్యునరేషన్‌ తీసుకోలేదని చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే.

గాడ్‌ఫాదర్‌ గురించి..

పొలిటిక‌ల్‌ డ్రామాకు ఫ్యామిలీ, యాక్ష‌న్ అంశాల‌ను జోడించి గాడ్‌ఫాద‌ర్ సినిమా రూపొందింది. చిరంజీవి ఇమేజ్‌పైనే ఆధార‌ప‌డి తెర‌కెక్కిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అత‌డిలోని హీరోయిజాన్ని ప్ర‌తి సీన్‌లో ఎలివేట్ చేస్తూ మెగా అభిమానుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా గాడ్‌ఫాద‌ర్ సినిమాను రూపొందించారు. ప్ర‌జ‌ల‌ను కాపాడే బాధ్య‌త రాజుకు ఉంటుంది. కానీ రాజు కుటుంబానికే క‌ష్టాలు వ‌స్తే ఓ గాడ్‌ఫాద‌ర్ ఎలా ప‌రిష్క‌రించాడో ఈ సినిమాలో చూపించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.