GodFather In 100 Cr Club: వంద కోట్ల క్ల‌బ్‌లో గాడ్‌ఫాద‌ర్ - నాలుగు రోజుల్లోనే ఈ ఘ‌న‌త‌-godfather collection chiranjeevi film enters 100 crore club in three days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Godfather Collection Chiranjeevi Film Enters 100 Crore Club In Three Days

GodFather In 100 Cr Club: వంద కోట్ల క్ల‌బ్‌లో గాడ్‌ఫాద‌ర్ - నాలుగు రోజుల్లోనే ఈ ఘ‌న‌త‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 10, 2022 06:11 AM IST

GodFather In 100 Cr Club: చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని ఈ సినిమా దాటింది.

చిరంజీవి
చిరంజీవి (Twitter)

GodFather In 100 Cr Club: చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. శ‌నివారం నాటితో ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

త‌క్కువ టైమ్‌లో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన రీమేక్ సినిమాగా గాడ్‌ఫాద‌ర్ రికార్డ్ క్రియేట్ చేసింది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో చిరంజీవి మేన‌రిజ‌మ్స్‌, హీరోయిజాన్ని పండించిన తీరు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ (Salman khan) అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా చ‌క్క‌టి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. హిందీ వెర్ష‌న్‌కు సంబంధించి వీకెండ్‌లో మ‌రో ఆరు వంద‌ల థియేట‌ర్ల‌ను యాడ్ చేసిన‌ట్లు చిరంజీవి వెల్ల‌డించాడు. పాజిటివ్ టాక్‌తో పాటు ద‌స‌రా సెల‌వులు క‌లిసిరావ‌డంతోనే గాడ్‌ఫాద‌ర్ భారీ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా గాడ్‌ఫాద‌ర్ నిలిచింది. ఈ సినిమాలో న‌య‌న‌తార(Nayanthara) కీల‌క పాత్ర పోషించింది. స‌త్య‌దేవ్ విల‌న్‌గా న‌టించాడు. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్వీప్ర‌సాద్ ఈసినిమాను నిర్మించారు. మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. చిరంజీవి గ‌త చిత్రం ఆచార్య లైఫ్‌టైమ్ వ‌సూళ్ల‌ను నాలుగు రోజుల్లోనే గాడ్‌ఫాద‌ర్ దాటేయ‌డం గ‌మ‌నార్హం.

IPL_Entry_Point