Rajini Kanth vs Chiranjeevi boxoffice Clash: ఒకేరోజు బాక్సాఫీస్ బ‌రిలో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి-jailer vs bhola shankar box office clash between rajinikanth and chiranjeevi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Jailer Vs Bhola Shankar Box Office Clash Between Rajinikanth And Chiranjeevi

Rajini Kanth vs Chiranjeevi boxoffice Clash: ఒకేరోజు బాక్సాఫీస్ బ‌రిలో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి

ర‌జ‌నీకాంత్
ర‌జ‌నీకాంత్

Rajini Kanth vs Chiranjeevi boxoffice Clash: ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి ఒకేరోజు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నారు. చిరంజీవి భోళాశంక‌ర్‌, ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాలు వ‌చ్చే ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

Rajini Kanth vs Chiranjeevi boxoffice Clash: వ‌చ్చే ఏడాది వేస‌విలో ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ ఒకేరోజు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి హీరోగా న‌టించిన భోళాంక‌ర్, ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2023 ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నాయి. జైల‌ర్, భోళాశంక‌ర్ సినిమాల షూటింగ్‌లు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

జైల‌ర్ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్ న‌టించ‌బోతున్న‌ట్లు గురువారం చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అత‌డి పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. బీస్ట్ ఫేమ్ నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ జైల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. గ‌త కొన్నాళ్లుగా ర‌జ‌నీకాంత్‌కు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లేదు. దాంతో జైల‌ర్‌పై అత‌డి అభిమానులు చాలా అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇటీవ‌ల‌ విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో త‌మిళంతో పాటు తెలుగులో సినిమాకు క్రేజ్ ఏర్ప‌డింది.

రెండు భాష‌ల్లో భారీ ఎత్తున జైల‌ర్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తోంది. అదే రోజున తెలుగులో చిరంజీవి భోళాశంక‌ర్ సినిమా విడుద‌ల అవుతోంది. త‌మిళ చిత్రం వేదాళం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. చిరంజీవి సోద‌రిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది.

జైల‌ర్, భోళాశంక‌ర్ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావ‌డం అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. భోళాశంక‌ర్ కార‌ణంగా జైల‌ర్ తెలుగు వెర్ష‌న్ క‌లెక్ష‌న్స్‌కు పెద్ద దెబ్బ ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. త‌మిళంలో ఓపెనింగ్స్‌కు ఇబ్బంది ఉండ‌దు కానీ ఎటొచ్చి తెలుగు వెర్ష‌న్‌కే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు.

అయితే భోళాశంక‌ర్ షూటింగ్ ఆల‌స్యం అవుతుండ‌టంతో ఏప్రిల్ 14న రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అదే జ‌రిగితే ర‌జ‌నీకాంత్‌కు తెలుగులో లైన్ క్లియ‌ర్ అవుతుంది.

WhatsApp channel