తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr | అమెరికాలో అప్పుడే మిలియన్ డాలర్ మూవీగా మారిపోయిన ఆర్ఆర్ఆర్

RRR | అమెరికాలో అప్పుడే మిలియన్ డాలర్ మూవీగా మారిపోయిన ఆర్ఆర్ఆర్

HT Telugu Desk HT Telugu

09 March 2022, 16:35 IST

google News
    • RRR.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ మూవీ కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. అమెరికాలో రిలీజ్‌కు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలే దీనికి నిదర్శనం.
విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ సంచలనాలు
విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ సంచలనాలు (MINT_PRINT)

విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ సంచలనాలు

ఎస్‌ఎస్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్లకున్న క్రేజ్‌ ఏంటో తెలిసిందే. ఈ ముగ్గురూ కలిసి సినిమా చేస్తున్నారంటేనే దానిపై ఎంత భారీ అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న మూవీ. రిలీజ్‌ ఇప్పుడు, అప్పుడూ అంటూ వాయిదా పడుతూ ఫ్యాన్స్‌లో ఆతృతను మరింత పెంచేసింది. 

దేశవిదేశాల్లో సంచలనం సృష్టించిన బాహుబలి తర్వాత మరో చారిత్రక కథాంశంతో రాజమౌళి తెరకెక్కించిన మూవీ కావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. బాక్సాఫీస్‌ దగ్గర బాహుబలి రెండు పార్ట్‌లు సృష్టించిన కలెక్షన్ల సునామీని బట్టి చూస్తే.. ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పటి వరకూ టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఈ మూవీ రిలీజ్‌కు ఎంతో ముందే రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఈ మూవీ రిలీజ్‌ కావడానికి రెండు వారాలకుపైగా సమయం ఉన్నా కూడా అప్పుడే అమెరికాలో మిలియన్‌ డాలర్‌ మూవీగా మారిపోయింది ఆర్‌ఆర్‌ఆర్‌. రిలీజ్‌కు ముందు అమ్మకాల ద్వారా ఇప్పటికే అమెరికాలో 10 లక్షల డాలర్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

ఇక రిలీజ్‌ సమయానికి ఇది 50 లక్షల డాలర్లకు చేరడం ఖాయమన్న ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫ్లోరిడాలోని జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు థియేటర్‌లోని మొత్తం టికెట్లు కొనేశారన్న వార్తలు మనం చూశాం. జూనియర్‌, రామ్‌చరణ్‌తోపాటు ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గన్‌లాంటి బాలీవుడ్‌ స్టార్లు కూడా ఉండటంతో నార్త్‌లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలనాలు సృష్టించడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఈ పాన్‌ ఇండియా మూవీ తెలుగు, హిందీతోపాటు తమిళం, మలయాళం వంటి సౌత్‌ ఇండియా భాషల్లోనూ రిలీజ్‌ కాబోతోంది. ఇక రిలీజ్‌కు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో ప్రి రిలీజ్‌ ఈవెంట్లు నిర్వహించాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం