RRR | మొత్తం థియేటర్‌నే కొనేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎక్కడో తెలుసా?
07 March 2022, 11:39 IST
- RRR మూవీ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం మొత్తం థియేటర్‌లోని ప్రీమియర్ టికెట్లన్నీ కొనేయడం విశేషం.
ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
RRR.. రౌద్రం రణం రుధిరం.. ఈ మధ్య కాలంలో ఈ మూవీ కోసం వేచి చూసినట్లుగా మరే మూవీ కోసం చూడలేదు. నిజానికి రాజమౌళి మూవీ అంటేనే అంత. సంవత్సరాల పాటు షూటింగ్‌లతో గడిపేసి.. ఆ తర్వాత ఆ మూవీకి సంబంధించి ఒక్కో విశేషాన్ని మెల్లగా బయటకు వదిలి.. సినిమాపై అమాంతం అంచనాలు పెంచడం రాజమౌళికే చెల్లింది. అందుకు ఈ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కూడా అతీతమేమీ కాదు.
అందులోనూ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కలిసి నటించడంతో ఈ ఇద్దరి అభిమానుల హడావిడి మామూలుగా లేదు. మామూలుగా రాజమౌళి సినిమా అంటేనే సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లాంటి యంగ్, ఎనర్జటిక్ హీరోలు కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విషయంలో ఈ ఆసక్తి, ఆతృత మరింత ఎక్కువగా ఉంది. సంక్రాంతి సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మొత్తానికి ఈ నెల 25న రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ సినిమా ప్రీమియర్ షో కోసం మొత్తం థియేటర్‌లోని టికెట్లన్నీ కొనేశారు జూనియర్ అభిమానులు. ఫ్లోరిడాలోని సినీమార్క్ టిన్సెల్‌టౌన్‌లో 6 గంటల షోకు టికెట్లన్నింటినీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొనేశారు. మామూలుగా అందరితో కలిసి మూవీ చూస్తేనే అభిమానుల హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటిది థియేటర్ మొత్తం వాళ్లే అంటే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు ఆలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గన్, సముద్రకనిలాంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
టాపిక్