తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan | రెండేళ్ల త‌ర్వాత వైఫ్‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన రామ్‌చ‌ర‌ణ్‌

Ram Charan | రెండేళ్ల త‌ర్వాత వైఫ్‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన రామ్‌చ‌ర‌ణ్‌

Nelki Naresh HT Telugu

29 April 2022, 14:13 IST

google News
  • రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్స్, ప్ర‌మోష‌న్స్ నుంచి చిన్న బ్రేక్ దొర‌క‌డంతో రామ్‌చ‌ర‌ణ్ వెకేష‌న్ ప్లాన్ చేశారు.

రామ్‌చ‌ర‌ణ్, ఉపాసన
రామ్‌చ‌ర‌ణ్, ఉపాసన (twitter)

రామ్‌చ‌ర‌ణ్, ఉపాసన

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దాదాపు నాలుగేళ్లుగా బిజీగా ఉన్నారు రామ్‌చ‌ర‌ణ్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తొలిత‌రం స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు. చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌ల‌కానుంది. తొలుత జ‌న‌వ‌రి 7న ఈ సినిమాను విడుద‌ల‌చేయాల‌ని భావించారు. భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు. కానీ కొవిడ్ థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం వ‌ల్ల మార్చి 25కు వాయిదావేశారు. త్వ‌ర‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో తిరిగి ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. 

‘ఆర్ఆర్ఆర్’ పూర్తికాగానే శంక‌ర్ సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయారు రామ్‌చ‌ర‌ణ్‌. ఇటీవ‌లే రాజ‌మండ్రిలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ భార‌తీయుడు గెట‌ప్‌లో క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యాయి.బ్రేక్ లేని షూటింగ్స్ కార‌ణంగా గత కొన్నేళ్లుగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం కొద్ది రోజులు షూటింగ్స్‌,ప్ర‌మోష‌న్స్ నుంచి విరామం దొర‌క‌డంతో భార్య ఉపాస‌న‌తో క‌లిసి ఆదివారం వెకేష‌న్‌కు వెళ్లారు. ‘రెండేళ్ల త‌ర్వాత వెకేష‌న్‌కు వెళుతున్నాం’ అంటూ భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్ తో ఫ్లైట్ జ‌ర్నీ చేస్తున్న ఫొటోను ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న‌ది. థాంక్యూ మిస్ట‌ర్ సి అంటూ ల‌వ్ ఎమోజీల‌ను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.అయితే వెకేష‌న్‌కు ఎక్క‌డ‌కు వెళుతున్న‌ది మాత్రం వారు వెల్ల‌డించ‌లేదు.

 

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం