తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr At Oscars: మూడు వారాల పాటు ఆస్కార్స్ స్పీచ్ ప్రాక్టీస్ చేసిన కీరవాణి: రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RRR at Oscars: మూడు వారాల పాటు ఆస్కార్స్ స్పీచ్ ప్రాక్టీస్ చేసిన కీరవాణి: రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

20 March 2024, 7:04 IST

google News
    • RRR at Oscars: ఆస్కార్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీకి అవార్డు ఖాయమని ముందే ఫిక్సయిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. మూడు వారాల పాటు స్పీచ్ ప్రాక్టీస్ చేశాడట. ఈ విషయాన్ని రాజమౌళి వెల్లడించాడు.
మూడు వారాల పాటు ఆస్కార్స్ స్పీచ్ ప్రాక్టీస్ చేసిన కీరవాణి: రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మూడు వారాల పాటు ఆస్కార్స్ స్పీచ్ ప్రాక్టీస్ చేసిన కీరవాణి: రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Invision)

మూడు వారాల పాటు ఆస్కార్స్ స్పీచ్ ప్రాక్టీస్ చేసిన కీరవాణి: రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RRR at Oscars: ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ఈ సినిమా చుట్టూ ప్రపంచం ఇంకా తిరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూనే ఉన్నాయి. అలాంటిదే ఇది కూడా. ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే ఫిక్సయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మూడు వారాల ముందు నుంచే ఎలా ప్రాక్టీస్ చేశాడో డైరెక్టర్ రాజమౌళి వివరించాడు.

ఆస్కార్స్ స్పీచ్.. కీరవాణి ప్రాక్టీస్

ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లోనూ అతి పెద్ద హిట్ గా నిలిచింది. 500ల రోజులకుపైనే అవుతున్నా.. అక్కడి థియేటర్లలో ఈ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. దీంతో అక్కడి ప్రేక్షకులతో కలిసి థియేటర్లో ఈ మూవీని చూడటానికి వెళ్లాడు డైరెక్టర్ రాజమౌళి. సినిమా తర్వాత థియేటర్లోనే అక్కడి ప్రేక్షకులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కీరవాణి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నాటు నాటు పాట కోసం ఆర్ఆర్ఆర్, కీరవాణి ఆస్కార్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే స్టేజ్ పై ఇవ్వాల్సిన స్పీచ్ ను అతడు మూడు వారాల ముందు నుంచే ప్రాక్టీస్ చేశాడట. "అకాడెమీ అవార్డుల సందర్భంగా మా అన్న కీరవాణి విషయంలో ఓ సరదా ఘటన జరిగింది. అతడు నాటు నాటు పాట కోసం నామినేట్ అయ్యాడు.

అవార్డు గెలుస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆస్కార్స్ లో మాట్లాడటానికి కేవలం 45 సెకన్ల సమయమే ఇస్తారు. అందువల్ల కీరవాణిని మూడు వారాల ముందు నుంచే స్పీచ్ ప్రాక్టీస్ చేయించాం. అతడు కాస్త లావుగా ఉంటాడు. దీంతో చెయిర్ పై నుంచి లేచి స్టేజ్ పైకి వెళ్లే సమయంలో కాస్త ఊపిరి ఆడనట్లుగా అవుతుంది. అందువల్ల మెల్లగా నడిచి వెళ్లి మాట్లాడమని చెప్పాం.

అతన్ని తన చెయిర్ లో నుంచి లేచి వచ్చి మెట్లు ఉన్న వేదికపై ఎక్కి కాస్త ఊపిరి పీల్చుకొని మాట్లాడేలా మూడు వారాల పాటు ప్రాక్టీస్ చేయించాం. కానీ అవార్డు అందుకునే రోజు కీరవాణి తన ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టేశాడు. అవార్డు కోసం చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. కానీ ఎలాగోలా ఊపిరి బిగపట్టుకొని స్పీచ్ కూడా పూర్తి చేశాడు. టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ ఓ పాట కూడా పాడాడు. మరుసటి రోజు మేము ఇంటికి వెళ్లినప్పుడు ఈ పాటను తన కూతుళ్లలో కలిసి రిచర్డ్ కార్పెంటర్ పాడి మా అన్నకు ట్రిబ్యూట్ ఇచ్చాడు. అప్పుడే అతడు కంటతడి పెట్టాడు" అని రాజమౌళి వివరించాడు.

జపాన్‌లో ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో 514 రోజులుగా ఆడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022లో మూవీ రిలీజైంది. కానీ జపాన్ లో కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండియా సహా మరే దేశంలోనూ లేని విధంగా ఈ సినిమాకు అక్కడ చాలా ఎక్కువ ఆదరణ లభించింది. ఈ సందర్భంగా వాళ్లకు థ్యాంక్స్ చెప్పడానికి భార్యతో కలిసి జపాన్ వెళ్లాడు రాజమౌళి.

అక్కడే మహేష్ బాబుతో చేయబోయే తన నెక్ట్స్ సినిమా గురించి కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయని, రిలీజ్ కు ముందు మహేష్ ను జపాన్ తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పడం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం