తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

13 September 2024, 21:39 IST

google News
    • Regina Sundeep Kishan: రెజీనా కసాండ్రా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? తరచూ తనకు డేటింగ్, సీక్రెట్ వెడ్డింగ్ అంటూ రూమర్లను అంటగట్టడంపై ఈ టాలీవుడ్ అందాల నటి తాజాగా స్పందించింది. ఆమె ఫన్నీ రియాక్షన్ వైరల్ అవుతోంది.
రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ
రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ

Regina Sundeep Kishan: రెజీనా కసాండ్రా.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో అభిమానులను సంపాదించుకున్న నటి. అయితే ఆమెను తరచూ ఇద్దరు హీరోలకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో పుకార్లు వస్తూ ఉంటాయి. అందులో ఒకరు సందీప్ కిషన్ కాగా.. మరొకరు సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్). అయితే ఈ మధ్య సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చింది.

రెజీనా రియాక్షన్ ఇదీ

ఈ ఇంటర్వ్యూలో రెజీనా.. సందీప్ కిషన్, సాయి దుర్గా తేజ్ లతో తనకున్న రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయింది. "సందీప్, నేను టామ్ అండ్ జెర్రీలాగా. ఇద్దరం ఒకరిపై మరొకరం అరచుకుంటాం. ఓ రెండు నెలల పాటు మాట్లాడుకోం. ఆ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలు పెడితే అసలు మా మధ్య ఎప్పుడూ ఏమీ జరగలేదన్నట్లుగా ఉంటాం.

మా ఇద్దరి మధ్య అలాంటి ఫ్రెండ్షిప్ ఉంది. సాయి కూడా మంచి ఫ్రెండే. అతడు చాలా కామ్, స్వీట్. అతనితో నా రిలేషన్షిప్ పూర్తిగా భిన్నమైనది. మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినా అందరూ ఎప్పుడూ వాళ్లతో నాకు సీక్రెట్ గా పెళ్లి చేసేస్తుంటారు" అని రెజీనా అనడం విశేషం.

అలాంటి వాడి కోసం చూస్తున్నా

ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను ఎలాంటి వాడి కోసం చూస్తున్నానో కూడా రెజీనా చెప్పుకొచ్చింది. "బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి అయినా ఎందుకు అనుకుంటుంది? నేను చాలా ఇండిపెండెంట్. నేను ఎవరి మాటా వినను. అందుకే అతడు నన్ను రక్షిస్తూ, నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.

నా జీవితంలో ఎన్నో రిలేషన్షిప్స్ లో ఉన్నాను. నేను సీరియల్ డేటర్ ను. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాను. నాకు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. పేరెంట్స్ అడిగినా అదే చెబుతాను. నేను అబద్దం చెప్పను" అని రెజీనా స్పష్టం చేసింది.

రెజీనా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గతేడాది రాకెట్ బాయ్స్, ఫర్జీలాంటి వెబ్ సిరీస్ లలో ఆమె నటించింది. ఇక ఇప్పుడు తెలుగులో ఉత్సవం మూవీ చేస్తోంది. తమిళంలో విదాముయర్చి, హిందీలో సెక్షన్ 108, గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సన్నీ డియోల్ నటిస్తున్న మరో మూవీలోనూ రెజీనా నటిస్తోంది.

రెజీనా ఉత్సవం ఎలా ఉందంటే?

రెజీనా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ఉత్సవం ఈ మధ్యే రిలీజైంది. సుర‌భి నాట‌క రంగ నేప‌థ్యానికి ఓ ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు అర్జున్ సాయి ఉత్స‌వం క‌థ‌ను రాసుకున్నాడు. నాట‌కాల‌కు స‌రైన ఆద‌ర‌ణ ఆదాయం లేక‌పోయినా ఇప్ప‌టికీ ఈ క‌ళ‌నే న‌మ్ముకొని కొంద‌రు ఎలా బ‌తుకుతున్నారు? వారి క‌ష్టాలు ఎలా ఉన్నాయ‌న్న‌ది హార్ట్ ట‌చింగ్‌గా సినిమాలో చూపించాడు డైరెక్ట‌ర్‌. ఓ వైపు నాట‌కాలు..మ‌రోవైపు ప్రేమ‌క‌థ‌ను స‌మాంత‌రంగా చూపిస్తూ క‌థ‌ను ముందుకు న‌డిపించాడు.

దిలీప్ ప్ర‌కాష్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఉత్స‌వం మూవీ సెప్టెంబ‌ర్ 13న (శుక్ర‌వారం) థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అర్జున్ సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ప్ర‌కాష్‌రాజ్, నాజ‌ర్‌, బ్ర‌హ్మానందంతో పాలు ప‌లువురు సీనియ‌ర్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

తదుపరి వ్యాసం