తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Wayanad Donation: ప్రభాస్ నిజంగా రాజే.. రెబల్ స్టార్ పెద్ద మనసు.. వయనాడ్ బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం

Prabhas Wayanad donation: ప్రభాస్ నిజంగా రాజే.. రెబల్ స్టార్ పెద్ద మనసు.. వయనాడ్ బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం

Hari Prasad S HT Telugu

07 August 2024, 11:01 IST

google News
    • Prabhas Wayanad donation: ప్రభాస్ రాజు తాను నిజంగా రాజే అని నిరూపించుకున్నాడు. రెబల్ స్టార్ పెద్ద మనసు చాటుకున్నాడు. వయనాడ్ బాధితుల కోసం భారీ ఆర్థిక సాయం చేశాడు.
ప్రభాస్ నిజంగా రాజే.. రెబల్ స్టార్ పెద్ద మనసు.. వయనాడ్ బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం
ప్రభాస్ నిజంగా రాజే.. రెబల్ స్టార్ పెద్ద మనసు.. వయనాడ్ బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం

ప్రభాస్ నిజంగా రాజే.. రెబల్ స్టార్ పెద్ద మనసు.. వయనాడ్ బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం

Prabhas Wayanad donation: రెబల్ స్టార్ ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించాడు. ఇప్పటి వరకూ ఏ హీరో ఇవ్వనంతగా అత్యంత భారీ ఆర్థిక సాయం చేయడం విశేషం. కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగి పడి వందల మంది మృత్యువాత పడిన విషాద ఘటనపై ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు సాయం చేసినా.. ప్రభాస్ మాత్రం అందరి కంటే ఎక్కువ మొత్తం ఇచ్చాడు.

వయనాడ్ కోసం ప్రభాస్

ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల ఆర్థిక సాయం చేశాడు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడం విశేషం. కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడి సుమారు 400 వరకు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇప్పటికీ సహాయ చర్యలు జరుగుతూనే ఉండగా.. మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరికొన్ని వందల మంది గాయపడ్డారు. ఏడు రోజులుగా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెను విషాదంతో కరిగిపోయిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఇండస్ట్రీలకు అతీతంగా తరలివచ్చి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం చేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి ఇలా..

వయనాడ్ సహాయ చర్యల కోసం ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు సాయం ప్రకటించారు. చరణ్, తాను కలిసి రూ. కోటి సాయం అందించినట్లు ఈ మధ్యే చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అటు అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్లు ఇవ్వడం విశేషం.

తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు మలయాళ, తమిళ ఇండస్ట్రీల ప్రముఖులు కూడా ఈ విషాదంపై స్పందించి తమ వంతు విరాళాలు సమర్పించారు. మమ్ముట్టి, అతని కొడుకు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.50 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

విరాళాలు ఇలా ఇవ్వండి

వయనాడ్ (Wayanad) జిల్లాలో కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వారి కోసం విరాళాలు సేకరించడానికి కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం "ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (Chief Minister's Disaster Relief Fund)"ని ప్రారంభించింది. సీఎం సహాయ నిధికి బ్యాంకు ఖాతా నంబరుతో సహా ప్రజలు విరాళాలు ఇవ్వగల వివిధ మార్గాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వయనాడ్ కొండచరియలు విరిగిపడిన బాధితులకు విరాళం ఇవ్వాలనుకుంటే వివరాలు ఇలా ఉన్నాయి.

"ఖాతా నంబర్: 67319948232

పేరు: ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (Chief Minister's Disaster Relief Fund)

బ్యాంకు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం

ఐఎఫ్ఎస్సీ SBIN0070028

స్విఫ్ట్ కోడ్: SBININBBT08

ఖాతా రకం: సేవింగ్స్

పాన్: AAAGD0584M.

keralacmdrf@sbi యూపీఐ కి ఫోన్ పే, లేదా జీ పే, లేదా మరే యూపీఐ మార్గం ద్వారా అయినా విరాళం ఇవ్వవచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం