Malavika Mohanan: మా అమ్మ చేసినట్లుగా ఉంది.. ప్రభాస్ ఇంటి ఫుడ్‌పై తంగలాన్ హీరోయిన్ ప్రశంసలు
Thangalaan Malavika Mohanan About Prabhas Home Food: ప్రభాస్ ఇంటి ఫుడ్‌పై తంగలాన్ హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రశంసలు కురిపించారు. తన అమ్మ చేసినంత టేస్టీగా ఉందని మాళవిక మోహనన్ చెప్పింది. చియాన్ విక్రమ్ తంగలాన్ ప్రెస్ మీట్‌లో మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Malavika Mohanan About Prabhas Home Food: ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్. పెట్టా, మాస్టర్, మారన్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మాళవిక మోహనన్ టాలీవుడ్‌లో మాత్రం అంతగా పాపులర్ కాలేకపోయింది. కానీ, ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీలో హీరోయిన్‌గా చేయడంతో ఆమెకు మంచి క్రేజ్ వస్తోంది.
మాళవిక మోహనన్ రాజాసాబ్ సినిమాతో పాటు నటించిన మరో మూవీ తంగలాన్. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తంగలాన్‌లో ఒక హీరోయిన్‌గా మాళవిక మోహనన్ చేసింది. డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీలో మాళవికతోపాటు పార్వతీ తిరువోతు నటించింది.
అయితే, ఈ నెల 15న చాలా గ్రాండ్‌గా ఇండిపెండెన్స్ డే సందర్భంగా తంగలాన్ రిలీజ్ కానుంది. తెలుగులో మైత్రీ డిస్ట్రిబ్యూషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా (ఆగస్ట్ 5) హైదరాబాద్‌లో తంగలాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్, మాళవిక, పార్వతితోపాటు ఇతర టెక్నిషియన్స్, నటీనటులు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. "నేనెప్పుడూ నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే కథల్లో, క్యారెక్టర్స్‌లో నటించాలని కోరుకుంటాను. తంగలాన్ సినిమాతో అలాంటి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఆరతి అనే క్యారెక్టర్‌లో నటించాను. ఈ క్యారెక్టర్ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది" అని చెప్పింది.
"విక్రమ్ గారితో కలిసి నటించడం గొప్ప ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. విక్రమ్ గారు లేకుంటే నేను ఈ సినిమాలో ఆరతి క్యారెక్టర్‌ను ఇంత బాగా పర్‌ఫార్మ్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే తంగలాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాణమైన ఒక టఫెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ సినిమాలో నటించేప్పుడు మేము ఈ పాత్రలు సరిగ్గా చేయగలమా లేదా ఈ సినిమాలో నటించడం చాలా కష్టంగా ఉంది అని చాలాసార్లు అనుకున్నాం. నాకే కాదు మా అందరిలోనూ అదే ఫీలింగ్ ఉండేది. చియాన్ విక్రమ్ లాంటి కోస్టార్ లేకుంటే నేను ఇంత బాగా నటించలేకపోయేదాన్ని" అని మాళవిక తెలిపింది.
"తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక బ్యాంగ్ లాంటి సినిమాతో టాలీవుడ్‌కు రావాలని వెయిట్ చేస్తూ వచ్చాను. రాజా సాబ్ సినిమాతో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన హైదరాబాద్‌లోని బెస్ట్ పుడ్ నాకు పంపారు. మా మదర్ చేసిన ఫుడ్ అంత టేస్ట్‌గా ఆ ఫుడ్ ఉంది" అని ప్రభాస్ ఇంటి ఫుడ్‌పై మాళవిక మోహనన్ చెబుతూ ప్రశంసలు కురిపించింది.
దీంతో ప్రభాస్ ఇంటి ఫుడ్‌ను మెచ్చిన హీరోయిన్‌ల జాబితాలో మాళవిక మోహనన్ చేరింది. శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, కృతి సనన్, శ్రుతి హాసన్, దీపికా పదుకొణె హీరోయిన్ల తర్వాత ఆరో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ అయింది. ఇంకా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ మారుతి గారు ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. తంగలాన్‌లో నా క్యారెక్టర్‌కు రాజా సాబ్‌లో నా క్యారెక్టర్‌తో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.