తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravanasura Update: ర‌వితేజ స్పీడు మామూలుగా లేదుగా - రావ‌ణాసుర షూటింగ్ కంప్లీట్‌

Ravanasura Update: ర‌వితేజ స్పీడు మామూలుగా లేదుగా - రావ‌ణాసుర షూటింగ్ కంప్లీట్‌

26 February 2023, 9:21 IST

  • Ravanasura Update: ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న రావ‌ణాసుర ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ర‌వితేజ
ర‌వితేజ

ర‌వితేజ

Ravanasura Update: ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య విజ‌యాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో ఈ జోష్‌ను కంటిన్యూ చేయాల‌ని ప్లాన్ చేస్తోన్నాడు. సినిమాల స్పీడు పెంచేసిన ర‌వితేజ తాజాగా రావ‌ణాసుర షూటింగ్‌ను కంప్లీట్ చేసిన‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్

Pavitra Jayaram: విషాదం: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూత

Malayalam: మలయాళంలో తీసి తెలుగులో డబ్ చేయండి, అప్పుడే చూస్తారు: హీరో షాకింగ్ కామెంట్స్

Bigg Boss Amardeep: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ అమర్ దీప్‌తో సినిమా.. మాస్ యువరాజా అంటూ!

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో ర‌వితేజ‌, మేఘా ఆకాష్‌ల‌పై శేఖ‌ర్ మాస్ట‌ర్ సార‌థ్యంలో ఓ పాట‌ను చిత్రీక‌రించారు.

శ‌నివారం నాటితో పాట షూట్ పూర్త‌యింది. ఈ పాట‌తోనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిన‌ట్లు చెబుతున్నారు. రావ‌ణాసుర స‌నిమాలో ర‌వితేజ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. నెగెటివ్ షేడ్స్‌తో ఆయ‌న క్యారెక్ట‌ర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌థానాయిక‌లుగా ఫ‌రియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ క‌నిపిస్తున్నారు. సుశాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల ర‌వితేజ పాడిన ప్యార్‌లోన పాగ‌ల్ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్‌7న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం