తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger Nageswara Rao Review: టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. గజదొంగగా రవితేజ ఆకట్టుకున్నాడా?

Tiger Nageswara Rao Review: టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. గజదొంగగా రవితేజ ఆకట్టుకున్నాడా?

Sanjiv Kumar HT Telugu

20 October 2023, 15:28 IST

google News
  • Tiger Nageswara Rao Movie Review: మాస్ మహారాజా గజదొంగగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న పాన్ ఇండియా మూవీగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు రివ్యూలోకి వెళితే..

రవితేజ టైగర్ నాగేశ్వరరావు రివ్యూ
రవితేజ టైగర్ నాగేశ్వరరావు రివ్యూ (Instagram)

రవితేజ టైగర్ నాగేశ్వరరావు రివ్యూ

టైటిల్: టైగర్ నాగేశ్వరరావు

నటీనటులు: రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, జిష్ణు సేన్ గుప్తా తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్ మది

దర్శకత్వం: వంశీ

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

నిర్మాత: అభిషేక్ అగర్వాల్

రచన, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా

విడుదల తేది: అక్టోబర్ 20, 2023

Tiger Nageswara Rao Review In Telugu: స్టూవర్టుపురం గజదొంగగా మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం నాగశ్వరరావు జీవితంలో చోటుచేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రాలను తెరకెక్కించారు. బాలకృష్ణ, విజయ్ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

1970, 80 దశకాల్లో దొంగతనం అంటే వినిపించే పేరు నాగేశ్వరరావు (రవితేజ). ఏదైనా దొంగతనం చేయాలంటే చెప్పి మరి చేయడం నాగేశ్వరరావు స్టైల్. అలాంటి నాగేశ్వరరావు గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ (అనుపమ్ ఖేర్) గుంటూరు క్రైమ్ డీఎస్పీ (మురళీ శర్మ)ను పిలిపించి, ప్రధానమంత్రి పేషీ ముఖ్యులతో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. దీంతో కథ మొదలు అవుతుంది.

ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి తలను నాగేశ్వరరావు ఎందుకు నరకాల్సి వచ్చింది? గరిక నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? ఎమ్మెల్యే యలమంద, సీఐ మౌళిలను ఎందుకు చంపాల్సి వచ్చింది? తను ప్రేమించిన అమ్మాయి సారా (నుపుర్ సనన్) ఏమైంది? మరదలు మణితో (గాయత్రి భరద్వాజ్) పెళ్లి కావడానికి గల కారణం ఏంటీ? నాగేశ్వరరావు ప్రధానమంత్రి ఆఫీస్‌కే వెళ్లి చేసిన సవాల్ ఏంటీ? అసలు దోచుకున్న డబ్బుతో అతను ఏం చేసేవాడు? అనేది తెలియాలంటే టైగర్ నాగేశ్వరరావు చూడాల్సిందే.

విశ్లేషణ:

స్టూవర్టుపురం గజదొంగగా నాగేశ్వరరావు అప్పట్లో బాగా పాపులర్. కానీ, అతని పర్సనల్ లైఫ్, దొంగగా మారడానికి గల కారణాలు ఏంటనేది తెలియదు. అందుకే, అతని జీవితంపై తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. అయితే, బయోపిక్ సినిమాల్లో ఎక్కువగా నిజ జీవితపు సంఘటనలు ఉంటాయి. అక్కడక్కడ లిబర్టీ తీసుకుని కల్పిత సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అయితే, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో దానికి కాస్తా భిన్నంగా చేసినట్లు అనిపిస్తుంది.

అందులో సక్సెస్

ప్రధానమంత్రి ఇంటికే దొంగతనానికి వస్తున్నట్లు లేఖ రాయడంతో ఆసక్తి కలిగించిన ఆ చోరీ చేసే విధానం పర్వాలేదనిపిస్తుంది. నాగేశ్వరరావు పాత్రకు ఇచ్చిన డైలాగ్ ఎలివేషన్‌కు తగినట్లుగా సీన్లు పడలేదు. అయితే, నాగేశ్వరరావు జీవితాన్ని రెండు కోణాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఒకటి వ్యక్తిగత జీవితం, మరొకటి దొంగగా అందరికీ తెలిసిన జీవితం. ఆ విషయాల్లో కాస్తా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

ఆకట్టుకోని సీజీ

దొంగతనాల మధ్య నాగేశ్వరరావు లవ్, పెళ్లి, పిల్లలు వంటివి కథను దారి మళ్లించాయి. స్క్రీన్ ప్లే కాస్తా రేసీగా ఉండాల్సింది. నిజ జీవితంలో నాగేశ్వరరావు 25 ఏళ్లకే చనిపోతాడు. కాబట్టి రవితేజను మొత్తం యంగ్‌గా చూపించాలి. కానీ, అది అంతగా వర్కౌట్ కాలేదని తెలిసిపోతుంది. సీజీపై కాస్తా దృష్టిపెట్టాల్సింది. దొంగతనం సమయంలో విజువల్స్ చాలా బాగున్నాయి. బీజీఎమ్ కూడా చాలా ఆకట్టుకునేవిధంగా ఉంది.

ఇంపాక్ట్ లేని రోల్

టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ అదరగొట్టాడనే చెప్పాలి. ఎప్పుడు చేయని పాత్రలో వైవిధ్యంగా రవితేజ మేకోవర్, యాక్టింగ్ ఉన్నాయి. నుపుర్, గాయత్రి గ్లామర్‌గానే కాకుండా పర్ఫామెన్స్ పరంగా కూడా ఆకట్టుకున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ నటన బాగుంది. అయితే రేణు దేశాయ్ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపదు. హరీష్ పేరడి, జిష్ణు సేన్ గుప్తా చక్కటి విలనిజం పండించారు. ఫైనల్‌గా చెప్పాలంటే కథ, ఎమోషన్స్ బాగున్నప్పటికీ స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. రవితేజ అభిమానులకు పండుగ లాంటి సినిమా.

రేటింగ్: 2.75/5

తదుపరి వ్యాసం