Bigg Boss 2.0: బిగ్ బాస్‌లోకి రవితేజ.. డైరెక్ట్ ఎలిమినేషన్.. అభిమానికి సపోర్ట్ చేస్తాడా?-ravi teja siddharth entry into bigg boss 7 telugu grand launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 2.0: బిగ్ బాస్‌లోకి రవితేజ.. డైరెక్ట్ ఎలిమినేషన్.. అభిమానికి సపోర్ట్ చేస్తాడా?

Bigg Boss 2.0: బిగ్ బాస్‌లోకి రవితేజ.. డైరెక్ట్ ఎలిమినేషన్.. అభిమానికి సపోర్ట్ చేస్తాడా?

Sanjiv Kumar HT Telugu

Bigg Boss 7 Telugu Grand Launch: మీరు ఎప్పుడు చూడనిది.. జరగనిది.. ఆదివారం జరగబోతుంది అని నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ 7 తెలుగు 2.0 ఉండనుంది. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు 7 ప్రోమో వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్‌లోకి రవితేజ.. డైరెక్ట్ ఎలిమినేషన్.. అభిమానికి సపోర్ట్ చేస్తాడా?

Bigg Boss Telugu 7 Promo: హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఐదు వారాలు గడిచిపోయాయి. ఐదు వారాల్లో టాప్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పాల్సిందిగా హోస్ట్ నాగార్జున అడిగాడు. ప్రశాంత్ పేరును అమర్ దీప్ చెబితే.. హౌజ్ మేట్ కాదు. కంటెస్టెంట్స్ లో అని శోభా శెట్టి చెప్పింది. నువ్ అర్థం చేసుకోవాలి అమర్ అని నాగార్జున అన్నారు. తర్వాత యావర్ పేరును శివాజీ చెప్పాడు. శివాజీ పేరు గౌతమ్ చెప్పాడు. ప్రియాంకకు తేజ ఓట్ వేశాడు.

డైరెక్ట్ ఎలిమినేషన్

అనంతరం ప్రతివారం సేవింగ్‌తో మొదలు పెడతాం కదా. ఈవారం ఎలిమినేషన్‌తో మొదలు పెడదాం అని కంటెస్టెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు నాగార్జున. ఎవరినీ ఎలిమినేట్ చేద్దామనుకుంటున్నారో చెప్పండమని నాగార్జున అడిగాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కక్కరి పేరు చెప్పారు. తర్వాత కంటెస్టెంట్స్ అందరిని యాక్టివిటీ రూమ్‌కు పంపించారు. ఎవరు వస్తారో.. ఎవరు వెళ్లిపోతారు తెలీదు. అందరికీ గుడ్ బై చెప్పుకోండి అని నాగార్జున అన్నాడు. చీకటిగా ఉన్న గదిలోకి కంటెస్టెంట్స్ అంతా వెళ్లారు.

టైగర్ నాగేశ్వరరావు

బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హీరో సిద్ధార్థ్, మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ వచ్చాడు. అయితే హౌజ్‌లో ఉన్న అమర్ దీప్ చౌదరి మాస్ మహారాజకు వీరాభిమాని. ఇదివరకు గుండు చేయించుకునే టాస్క్ లో తనలాగే హెయిర్ ఉందని రవితేజ అన్నారని అమర్ చెప్పాడు. మరి తాజాగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ్ తన అభిమాని అమర్ దీప్‌కు సపోర్ట్ చేస్తాడా లేదా అనేది పూర్తి ఎపిసోడ్ వచ్చాకే తెలుస్తుంది.

సపోర్ట్ చేస్తే..

అయితే ఈ సీజన్‌లో ఎన్నో అంచనాలతో అడుగుపెట్టి అంతకుమించి నెగెటివిటీ సంపాదించుకున్నవాళ్లలో అమర్ దీప్ ముందుటాడు. టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్ తన మైండ్ సెంట్, గేమ్ కారణంగా నెగెటివిటీ తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో ఓటింగ్‌లో చివరి మూడో స్థానానికి పడిపోయాడు. మరి తాజా ఎపిసోడ్‌లో అమర్‌కు రవితేజ ఒకవేళ సపోర్టింగ్‌గా మాట్లాడితే.. అతనికి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే దాన్ని అమర్ మిస్ యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు.