Ravi Teja at World Cup: టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్‌కు మాస్ మహరాజా.. క్రికెట్ విశేషాలు పంచుకోనున్న రవితేజ
Ravi Teja at World Cup: టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్‌కు మాస్ మహరాజా రానున్నాడు. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు క్రికెట్ లైవ్ షోలో రవితేజ పాల్గొననున్నాడు.
Ravi Teja at World Cup: టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ క్రికెట్ విశేషాలు పంచుకోడానికి సిద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 8) ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షోలో అతడు పాల్గొనున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇండియా ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 గురువారం (అక్టోబర్ 5) ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడతున్నాయి. ఇక ఆతిథ్య ఇండియా ఆదివారం (అక్టోబర్ 8) తన వరల్డ్ కప్ వేట మొదలుపెట్టనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షోలో రవితేజ పాల్గొననున్నాడు.
అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మాస్ మహరాజా.. ఈ మ్యాచ్ కు ముందు క్రికెట్ గురించి మాట్లాడుతూ అభిమానులను అలరించనున్నాడు. వరల్డ్ కప్ లో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా.. 12.30 గంటల నుంచే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో స్పెషల్ షో రానుంది.
మాస్ మహారాజ్, స్టార్ హీరో రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. నాగేశ్వరరావు పాత్ర చేస్తున్నారు రవితేజ. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్‌తో టైగర్ నాగేశ్వరరావు సినిమాపై అమితాసక్తి నెలకొంది. యువ దర్శకుడు వంశీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ అయింది.
ఈ ట్రైలర్ పవర్‌ఫుల్‍గా, ఇంట్రెస్టింగ్‍గా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా సాగింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్ కూడా ఐదు భాషల్లో వచ్చింది.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ, హరీశ్ పేరడి, సుదేవ్ నాయర్ కీలకపాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.