Nagarjuna Remuneration: లీకైన నాగార్జున రెమ్యునరేషన్.. బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్‍కి కోట్లల్లో పారితోషికం
Bigg Boss 7 Telugu Nagarjuna Remuneration: తెలుగులో బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ కొనసాగుతుండగా.. హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ లీకైంది.
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ నాలుగు వారాలకు చేరుకుంది. ఇందులోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 11 మంది హౌజ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇటీవల జరిగిన నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్లకు నాలుగో పవరాస్త్రను దక్కించుకునేందుకు టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో కంటెస్టెంట్స్ చురుగ్గా పాల్గొంటూ.. మంచి కంటెంట్ ఇస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 3 నుంచి
ఇక ప్రతి బిగ్ బాస్ సీజన్‍లో సెలబ్రిటీలను కంట్రోల్ చేయడం, వారించడం, సలహాలు ఇవ్వడం, ఎంటర్టైన్ చేయడం వంటివి చేయడం హోస్ట్ పని. బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జునే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ 7 తెలుగుకు హోస్ట్ చేస్తున్నందుకు నాగార్జున అధికంగా రెమ్యునరేషన్ అందుకోనున్నారని ఓ న్యూస్ లీక్ అయింది.
ఒక్కో ఎపిసోడ్‍కు
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఒక్కో ఎపిసోడ్‍కు రూ. కోటి పారితోషికం తీసుకుంటున్నారట నాగార్జున. ఈ సీజన్ ఎంత లేదన్నా 3 నెలలు సాగుతుంది. అంటే దాదాపుగా 12 వారాలకుపైనే ప్రసారం అవుతుంది. నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేసే శని, ఆది వారాలు కలుపుకుని బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొత్తానికి మన్మథుడికి సుమారు రూ. 20 కోట్లకుపైగా పారితోషికం అందుతుందని సమాచారం.
మొత్తంగా 20 కోట్లు
ఇదిలా ఉంటే నాగార్జున బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‍కు మొత్తంగా రూ. 5 నుంచి 8 కోట్లు తీసుకున్నాడట. నాలుగో సీజన్‍కు రూ. 8 నుంచి 10 కోట్లు, ఐదో సీజన్‍కు రూ. 12 కోట్లు, 6వ సీజన్‍కు రూ. 16 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక అన్ని సీజన్లకు మించి భారీగా బిగ్ బాస్ 7 తెలుగుకు నాగార్జున రూ. 20 కోట్లు అందుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
సినిమా కంటే ఎక్కువ
బిగ్ బాస్ షోకి నాగార్జున వీకెండ్ ఒక రోజు కేటాయిస్తే సరిపోతుంది. మొత్తంగా దీని కోసం నాగ్ 15 రోజులు వెచ్చిస్తారు. అంటే కింగ్ నాగార్జునకు ఒక సినిమా కంటే బిగ్ బాస్ షోకి వచ్చే పారితోషికమే ఎక్కువ అని అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం నా సామిరంగ సినిమాతో బిజీగా ఉన్నారు.