Tiger Nageswara Rao OTT: టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్
Tiger Nageswara Rao OTT Release: గజదొంగగా మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. శుక్రవారం (అక్టోబర్ 20)న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ ప్లాట్ ఫామ్, రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.
Tiger Nageswara Rao OTT Partner: మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఆంధ్ర రాబిన్ హుడ్‌గా పేరొందిన స్టూవర్టుపురం నాగేశ్వర రావు బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా అలరించనున్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే మూవీ ట్రైలర్‌కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనన టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని పాటలు కూడా పర్వాలేదనిపించాయి. ముఖ్యంగా జీవీ ప్రకాష్ బీజీఎమ్ అదిరిపోయింది. సినిమాలో రవితేజకు జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా చేశారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 20న సౌత్, నార్త్ భాషల్లో విడుదల చేశారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ తన యాక్టింగ్‌తో రఫ్పాడించేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి. టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో తెలుగుతోపాటు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే, టైగర్ నాగేశ్వరరావు సినిమాను థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలో 8 వారాలకు స్ట్రీమింగ్ చేయనున్నారట. అలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని టాక్. థియేటర్లలో దసరాకు విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.