Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు నుంచి రొమాంటిక్ సాంగ్.. రవితేజ, గాయత్రి కెమిస్ట్రీ అదుర్స్-ravi teja tiger nageswara rao icchesukuntaale third single released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు నుంచి రొమాంటిక్ సాంగ్.. రవితేజ, గాయత్రి కెమిస్ట్రీ అదుర్స్

Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు నుంచి రొమాంటిక్ సాంగ్.. రవితేజ, గాయత్రి కెమిస్ట్రీ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Oct 13, 2023 09:34 AM IST

Tiger Nageswara Rao Update: మాస్ మహారాజా తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఎన్నో అంచనాలతో హైప్ పెంచేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

టైగర్ నాగేశ్వరరావు నుంచి రొమాంటిక్ సాంగ్.. రవితేజ, గాయత్రి కెమిస్ట్రీ అదుర్స్
టైగర్ నాగేశ్వరరావు నుంచి రొమాంటిక్ సాంగ్.. రవితేజ, గాయత్రి కెమిస్ట్రీ అదుర్స్

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఇటివలే విడుదలై ట్రైలర్‌ కు నేషనల్ వైడ్ గా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని రెండు పాటలు చార్ట్ బస్టర్స్ హిట్స్ కొట్టాయి. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ (Icchesukuntaale Song) పాటని విడుదల చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్‌తో ఆకట్టుకున్నారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇచ్చేసుకుంటాలే పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్‌ల కెమిస్ట్రీ వండర్ ఫుల్ గా ఉంది. విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే నుపుర్ సనన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి అందిస్తున్నారు. కాగా టైగర్ నాగేశ్వరరావు మూవీని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలో విడుదల కానుంది.

Whats_app_banner