తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan: మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు: హీరో రవితేజ కీలక నిర్ణయం.. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా..

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు: హీరో రవితేజ కీలక నిర్ణయం.. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా..

04 September 2024, 20:08 IST

google News
    • Mr Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయింది. నిర్మాతలకు భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చింది. ఈ తరుణంలో రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారనే విషయం బయటికి వచ్చింది.
Mr Bachchan: మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు: హీరో రవితేజ కీలక నిర్ణయం.. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా..
Mr Bachchan: మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు: హీరో రవితేజ కీలక నిర్ణయం.. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా..

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు: హీరో రవితేజ కీలక నిర్ణయం.. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా..

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. ట్రైలర్, పాటలు బాగుండటంతో క్యూరియాసిటీని పెంచింది. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ముందుగా ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. అయితే, హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ చతికిలపడింది.

మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చాయి. ఈ తరుణంలో హీరో రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రెమ్యూనరేషన్‍లో కోత

మిస్టర్ బచ్చన్ సినిమాకు తాను తీసుకోవాల్సిన రెమ్యూనరేషనలో రూ.4కోట్లను రవితేజ తగ్గించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. నిర్మాలతకు భారీ నష్టాలు రావటంతో కాస్త వాటిని పూడ్చేందుకు తన రెమ్యూనరేషన్‍ను మాస్ మహారాజ తగ్గించుకున్నారని టాక్. దర్శకుడు హరీశ్ శంకర్ కూడా తన రెమ్యూనరేషన్‍లో రూ.2కోట్లను నిర్మాతలకు తిరిగి ఇచ్చేయనున్నారట.

ఘోరంగా కలెక్షన్లు

మిస్టర్ బచ్చన్ సినిమా సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు టీ సిరీస్, పనోరమ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ మూవీ థియేట్రికల్ హక్కులను తీసుకొని రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా మొత్తంగా రూ.8కోట్లను కూడా దాటలేదని సమాచారం. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలనే ఈ చిత్రం మిగిల్చింది.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కు రీమేక్‍గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని హరీశ్ శంకర్ తెరకెక్కించారు. చాలా మార్పులు చేసి, కమర్షియల్ అంశాలు జోడించి ఈ మూవీని తీసుకొచ్చారు. అయితే, మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మిస్టర్ బచ్చన్ చిత్రానికి నెగెటివ్ టాక్ రావటంతో 13 నిమిషాల రన్‍టైమ్‍ను కూడా మూవీ టీమ్ తగ్గించింది. అయినా కూడా ఫలితం లేకపోయింది. కలెక్షన్లలో ఈ చిత్రం పుంజుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. రెండేళ్లుగా సరైన హిట్ లేని రవితేజకు మరో ప్లాఫ్ ఎదురైంది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాలో కొన్ని డ్యాన్స్ మూవ్‍మెంట్స్ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో పాటలకు మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

మిస్టర్ బచ్చన్ మూవీలో జగపతి బాబు, శుభలేఖ సుధాకర్, సత్య, సచిన్ ఖేడేకర్, చమ్మక్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ క్యామియో రోల్‍లో కనిపించారు.

మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. రిలీజ్‍కు ముందే మంచి ధరకు దక్కించుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ మూడో వారంలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెడుతుందనే అంచనాలు ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం