OTT Comedy Family Drama: రావు రమేశ్ సినిమా రిలీజ్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో వస్తోందంటే..
10 September 2024, 20:26 IST
- Maruthi Nagar Subramanyam OTT: మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. అంచనాలకు మించి సినిమాకు కలెక్షన్లు ఈ రావటంతో పాటు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
Maruthi Nagar Subramanyam OTT: రావు రమేశ్ సినిమా రిలీజ్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో వస్తోందంటే..
సపోర్టింగ్ పాత్రల్లో సీనియర్ యాక్టర్ రావు రమేశ్ చాలా చిత్రాల్లో మెప్పించారు. వైవిధ్యమైన నటనతో అదరగొట్టారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. రావు గోపాల రావు కుమారుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. కొంతకాలంలోనే తన నటనతో సొంతంగా పేరు తెచ్చుకున్నారు. చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా, రావు రమేశ్ ప్రధాన పాత్రలో మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రం ఇటీవలే వచ్చింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీకి ప్రశంసలు దక్కాయి.
మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రం ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరవటంతో హైప్ విపరీతంగా పెరిగింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ కామెడీ డ్రామా చిత్రానికి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ రావటంతో మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆహా ఓటీటీ ఓ అప్‍డేట్ ఇచ్చింది.
ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారు
మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రావడం ఖరారైంది. ఈ విషయంపై ఆహా నేడు అప్‍డేట్ ఇచ్చింది. “మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయనున్నారు. గట్టిగా నవ్వేందుకు రెడీగా ఉండండి. సరదాగా ఉండే మారుతీ నగర్ సుబ్రమణ్మం మూవీ త్వరలో ఆహాలోకి రానుంది” అని సోషల్ మీడియాలో ఆహా వెల్లడించింది.
అయితే, మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను ఇప్పటికైతే ఆహా వెల్లడించలేదు. త్వరలో అని అప్‍డేట్ ఇచ్చింది. అయితే, ఆహాలో ఈ మూవీ రావడం ఖరారైంది. అయితే, ఈ చిత్రం వచ్చే వారమే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలో డేట్‍ను ఆహా వెల్లడించనుంది.
మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. చాలా మందికి కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ కుటుంబంలోని పరిస్థితులతో ఈ కథ రాసుకున్నారు. కామెడీ, ఎమోషన్స్, డ్రామాతో ఈ మూవీని మెరుగ్గా తెరకెక్కించారు. రావు రమేశ్‍తో పాటు ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి లీడ్ రోల్స్ చేశారు. హర్షవర్దన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలకపాత్రల్లో కనిపించారు.
మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రానికి కల్యాణ్ నాయక్ సంగీతం అందించారు. పీబీఆర్ సినిమాస్, లోక్‍మాత్రే క్రియేషన్స్ పతాకాలపై ఈమూవీని బుజ్జి రాయుడు, మోహన్ కార్య నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ మూవీని సమర్పించారు. దీంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు అల్లు అర్జున్, సుకుమార్ హాజరయ్యారు.
మారుతీ నగర్ సుబ్రమణ్యం స్టోరీలైన్
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతూనే ఉంటాడు సుబ్రమణ్యం (రావు రమేశ్). దీంతో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు భార్య కళారాణి (ఇంద్రజ). వీరి కుమారుడు అర్జున్ (అంకిత్ కొయ్య) కూడా పెద్దవాడై ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతుంటాడు. కాంచన (రమ్య)తో ప్రేమలో పడతాడు. అయితే, ఓ రోజు సడెన్‍గా సుబ్రమణ్యం బ్యాంక్ అకౌంట్‍లో రూ.10లక్షలు జమ అవుతాయి. ఆ మొత్తాన్ని తండ్రీ కొడుకులు అవసరాలకు వాడేసుకుంటారు. దీంతో చిక్కుల్లో పడతారు. అసలు ఆ డబ్బును సుబ్రమణ్యం ఖాతాలో ఎవరు డిపాజిట్ చేశారు? వాటిని వాడుకున్నాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బయటపడగలిగారా? అనేవి మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రంలో ప్రధానంగా ఉంటాయి.