తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana About Mahesh Babu: మహేష్‌ను నమ్రత భర్తేగా అన్నారు.. షాకయ్యాను.. జస్ట్ వెయిట్ అన్నాను.. రానా ఆసక్తికర వ్యాఖ్యలు

Rana about Mahesh Babu: మహేష్‌ను నమ్రత భర్తేగా అన్నారు.. షాకయ్యాను.. జస్ట్ వెయిట్ అన్నాను.. రానా ఆసక్తికర వ్యాఖ్యలు

03 March 2023, 17:31 IST

google News
    • Rana about Mahesh Babu: బాలీవుడ్‌లో ఓ స్నేహితుడితో తనకు జరిగిన సంభాషణ గురించి రానా వివరించారు. కొన్నేళ్ల క్రితం మహేష్ బాబును నమ్రతా భర్తగా తన స్నేహితుడు గుర్తించినట్లు రానా తెలిపారు.
రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి (AFP)

రానా దగ్గుబాటి

Rana about Mahesh Babu: రానా దగ్గుబాటి ప్రస్తుతం ఆయన నటించిన తాజా నెట్ ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడుతో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా సిరీస్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అంతేకాకుండా సౌత్ సినిమాల గురించి, గతంలో సౌత్ నటులను ఏ విధంగా చూసేవారో తెలిపారు. టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన మహేష్ బాబును సైతం బాలీవుడ్‌లో నమ్రతా భర్తగానే చూశారని, కొన్ని రోజుల తర్వాత సౌత్ హీరోల గురించి తెలుస్తుందని అన్నారు.

కొంతకాలం క్రితం ముంబయిలో ఓ స్నేహితుడుతో జరిగిన సంభాషణ గురించి రానా వివరించారు. "బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. అందుకే ఈ స్నేహితుడిని కలిసినప్పుడు ఆ సినిమా గురించి చెప్పాను. టైటిల్‌ రోల్‌లో ఎవరు నటిస్తున్నారని ఆయన అడిగితే.. నేను ప్రభాస్ అని చెప్పాను. ఎవరు ప్రభాస్? అని ఆయన అడిగారు. ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. వెంటనే ప్రభాస్‌ నటించిన కొన్ని సినిమాలు గురించి వివరించాను. కానీ అతడు ఆ సినిమాలేవి చూడలేదు. అనంతరం తనకు తెలుగులో ఒకే హీరో తెలుసని బదులిచ్చాడు. ఎవరని నేను అడిగ్గా.. చిన్ను భర్త గురించి మాత్రమే తనకు తెలుసని స్పష్టం చేశాడు. నాకు ఆశ్చర్యమేసింది. చిన్ను భర్త అంటే నమ్రత శీరోద్కర్ భర్త మహేష్ బాబు. తెలుగులో మహేష్ తప్పా ఇంకెవ్వరూ అతడికి తెలియదనగానే షాక్ అయ్యాను. అప్పుడు నేను ఓ నాలుగైదు సంవత్సరాలు ఆగు.. మా సైన్యమంతా ఇక్కడ దిగుతుంది అని చెప్పాను." అని రానా వివరించారు.

భారత్‌లో ప్రాంతీయ సినిమాల హద్దులను చెరిపేసిన ఆర్ఆర్ఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి రానా గతంలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాతో తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రానా నాయుడు సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

రానా నాయుడు సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, నుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుపరన్ వర్మ, కరన్ వర్ణ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్.

తదుపరి వ్యాసం