Venkatesh About Rana Naidu: రానా నాయుడులో నటించేటప్పుడు అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యా.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్
Venkatesh About Rana Naidu: రానా నాయుడు సిరీస్‌లో నటించేంటప్పుడు తాను కొంచెం అసౌకర్యంగా ఫీలయ్యానని చెప్పాడు. స్క్రిప్టులో భాగంగా కొన్ని సార్లు బూతులు మాట్లాడాల్సి వచ్చిందని కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు మాత్రం అన్ కంఫర్టుబుల్‌గా ఫీలయ్యానని స్పష్టం చేశాడు.
Venkatesh About Rana Naidu: దగ్గుబాటి వెంకటేష్ నటించిన తాజా సిరీస్ నెట్‌ఫ్లిక్స్ రానా నాయుడు. ఇందులో రానాతో కలిసి వెంకీ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం ఈ నెలలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇది అమెరికన్ సిరీస్ రే డోనావన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. వెంకటేష్ ఇంతకు ముందు ఎప్పుడూ పోషించని క్యారెక్టర్‌లో నటించారు. తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ క్యారెక్టర్ తన వద్దకు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వారికి కూడా చెప్పానని, యూత్‌ను బాగా ఆకర్షిస్తుందని వారు అన్నట్లు వెంకీ పేర్కొన్నారు. యువతను ఉత్సాహంగా ఉన్న కారణంగా రానా నాయుడులో ఈ పాత్ర పోషించినట్లు స్పష్టం చేశారు. తాను ఈ రిస్క్ తీసుకోకపోతే నటుడిగా తనను తాను సవాలు చేసుకోలేనని ఆయన అన్నారు.
రానా నాయుడు సిరీస్‌లో రానా, వెంకటేష్ ఇద్దరూ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఇరువురి మధ్య ఫైట్లు కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే వెంకటేష్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నారు. అందుకు తగినట్లు తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా ఆయన మార్చుకున్నారు. మరి ఈ క్యారెక్టర్ గురించి పూర్తిగా చూడాలంటే మార్చి 10న విడుదల కానున్న రానా నాయుడు సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి ఉండాలి.
రానా, వెంకటేష్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సిరీస్ ఇదే. అందులోనూ హిందీలో ఈ సిరీస్ తెరకెక్కింది. తెలుగు సహా ఇతర భాషల్లోనూ అనువదించనున్నారు. వెబ్ సిరీస్ కావడంతో కొన్ని బూతు పదాలు కూడా ఇందులో ఉన్నాయని వెంకటేష్ తెలిపారు. అయితే హిందీలో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని, కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు మాత్రం అసౌకర్యానికి గురైనట్లు ఆయన అన్నారు. ఇందుకోసం తెలుగులో ఆ మాటల తీవ్రతను కాస్త తగ్గించమని దర్శకులను కోరినట్లు చెప్పారు.
రానా నాయుడు సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, నుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుపరన్ వర్మ, కరన్ వర్ణ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్.
టాపిక్