Mahesh Babu New Look: కొత్త లుక్‌లో మహేష్‌బాబు -వర్కవుట్ ఫొటోలు వైరల్
28 March 2023, 13:12 IST
Mahesh Babu New Look: మహేష్‌బాబు వర్కవుట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో కొత్త లుక్‌లో మహేష్ కనిపిస్తోన్నాడు.
మహేష్‌బాబు
Mahesh Babu New Look: ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మహేష్‌బాబు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా గురువారం మహేష్‌బాబు కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
వర్కవుట్ చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఆర్మ్ డే అంటూ ఈ ఫొటోలను క్యాప్షన్ ఇచ్చారు. మెలి తిరిగిన కండలతో మహేష్ బై సిప్స్ చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలకు మహేష్ సతీమణి నమ్రత ఫైర్ ఎమోజీలను జోడించింది.
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు మహేష్ రెడీ అవుతున్నాడంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేశారు. కొత్త లుక్ ఆదుర్స్ అంటూ పలువురు నెటిజన్లు మహేష్ ఫొటోలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తోన్నారు. మహేష్ - త్రివిక్రమ్ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆగస్ట్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. త్రివిక్రమ్ మూవీ తర్వాత అగ్ర దర్శకుడు రాజమౌళితో అడ్వెంచరస్ సినిమా చేయబోతున్నాడు మహేష్.