Tiger Nageswara Rao Release Date: మ‌హేష్‌బాబు వ‌ర్సెస్ ర‌వితేజ - టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రిలీజ్ డేట్ ఇదేనా-ravi teja tiger nageswara rao ssmb28 movies to hit big screens on same date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja Tiger Nageswara Rao Ssmb28 Movies To Hit Big Screens On Same Date

Tiger Nageswara Rao Release Date: మ‌హేష్‌బాబు వ‌ర్సెస్ ర‌వితేజ - టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రిలీజ్ డేట్ ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Feb 23, 2023 07:22 AM IST

Tiger Nageswara Rao Release Date: కెరీర్‌లో తొలిసారి పీరియాడిక‌ల్ క‌థాంశంతో ర‌వితేజ చేస్తోన్న సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఆగ‌స్ట్‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 ర‌వితేజ
ర‌వితేజ

Tiger Nageswara Rao Release Date: ధ‌మ‌కా, వాల్తేర్ వీర‌య్య సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు ర‌వితేజ‌. ఈ స‌క్సెస్‌ల‌తో ర‌వితేజ నెక్స్ట్ సినిమాల‌పై టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో భారీగా క్రేజ్ ఏర్ప‌డింది. కెరీర్‌లో తొలిసారి పీరియాడిక‌ల్ క‌థాంశాన్ని ట‌చ్ చేస్తూ ర‌వితేజ న‌టిస్తోన్న తాజా సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.

1970-80 ద‌శ‌కంలో ఏపీలో పేరుమోసిన దొంగ‌గా చెలామ‌ణీ అయిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితానికి ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ సినిమాను ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే రోజున మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ మూవీ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రు స్టార్ హీరోలు న‌టించిన సినిమాలు ఒకేరోజు విడుద‌ల‌కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతిస‌న‌న్ సోద‌రి నుపుర్ స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో నాయిక‌గా గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్ క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాతో రేణుదేశాయ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. హేమ‌ల‌త ల‌వ‌ణం అనే పాత్ర‌లో ఆమె న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుతో పాటు రావ‌ణాసుర సినిమా చేస్తోన్నాడు ర‌వితేజ‌. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేనితో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు

IPL_Entry_Point