Double Ismart TV Premiere: రెండ్రోజుల్లో టీవీలోకి డబుల్ ఇస్మార్ట్- ఐఎమ్‌డీబీ షాకింగ్ రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
25 October 2024, 12:53 IST
Double Ismart TV Premiere Worldwide On Zee Telugu: రామ్ పోతినేని యాక్షన్ థ్రిల్లర్ మూవీ డబుల్ ఇస్మార్ట్ మరోసారి వరల్డ్ వైడ్‌గా బుల్లితెరపైకి రానుంది. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జీ తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం రెండ్రోజుల్లో ప్రసారం కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రెండ్రోజుల్లో టీవీలోకి డబుల్ ఇస్మార్ట్- ఐఎమ్‌డీబీ షాకింగ్ రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
Double Ismart TV Premiere Worldwide: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బ్యూటిఫుల్ కావ్య థాపర్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’.
టీవీ ఛానెల్‌లో
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది జీ తెలుగు. పూరీ జగన్నాథ్ మార్క్ డైరెక్షన్, హై ఓల్టేజ్ యక్షన్ సీన్స్, రామ్ పోతినేని నటవిశ్వరూపంతో అదరగొట్టిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఈ ఆదివారం (అక్టోబర్ 27న) సాయంత్రం జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు.
అధికారిక ప్రకటన
అంటే, మరో రెండు రోజుల్లో జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు డబుల్ ఇస్మార్ట్ టీవీ ప్రీమియర్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను జీ తెలుగు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. కాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.
బ్లాక్ బస్టర్ సీక్వెల్
2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డబుల్ ఇస్మార్ట్ టైటిల్‌తో సీక్వెల్ ప్లాన్ చేశారు. మరోసారి పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ అనగానే బీభత్సమైన అంచనాలు పెరిగాయి. కానీ, ఆ అంచనాలను అంతగా అందుకోలేకపోయింది డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం.
90 కోట్ల బడ్జెట్
రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఓపెనింగ్ డే నాడు డబుల్ ఇస్మార్ట్ చిత్రం కేవలం7.35 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అలాగే మొదటి నాలగు రోజుల్లో ఈ సినిమాకు రూ. 11.22 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
బిగ్ బుల్ చుట్టూనే
ఇదిలా ఉంటే, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ అంతర్జాతీయ మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) చుట్టూ తిరుగుతుంది. అతను గ్లియోమా నిర్ధారణ అయిన తర్వాత మరణం నుంచి తప్పించుకోవడానికి ఆరాటపడతాడు. అతని జ్ఞాపకశక్తిని మరొకరి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతను అమరుడవుతాడని ఒక శాస్త్రవేత్త సూచించడంతో అందుకు సరిపోయే వ్యక్తికోసం అన్వేషణ మొదలవుతుంది.
మెమరీ ట్రాన్స్‌ఫర్
ఆ అన్వేషణలో హైదరాబాద్‌లోని శంకర్ (రామ్ పోతినేని) సరైన వ్యక్తిగా గుర్తించడంతో బిగ్బుల్ మెమరీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తికర విషయాలతో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కింది. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, గెటప్ శ్రీను, అలీ, షాయాజీ షిండే, ఝాన్సీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
టాపిక్