తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Doctorate: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్‍చరణ్: వీడియో

Ram Charan Doctorate: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్‍చరణ్: వీడియో

13 April 2024, 18:20 IST

google News
    • Ram Charan Doctorate: మెగా పవర్ పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ డాక్టరేట్ అందుకున్నారు. వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు ఆ గౌరవం ఇచ్చింది. ఆ వివరాలివే..
Ram Charan Doctorate: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్‍చరణ్: వీడియో
Ram Charan Doctorate: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్‍చరణ్: వీడియో

Ram Charan Doctorate: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్‍చరణ్: వీడియో

Ram Charan Doctorate: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ మరో గౌరవం అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ పొంది.. డాక్టర్ రామ్‍చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రతిష్టాత్మక వేల్స్ (VELS) యూనివర్సిటీ రామ్‍చరణ్‍కు నేడు (ఏప్రిల్ 13) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ 14వ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆ గౌరవాన్ని స్వీకరించారు.

సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను రామ్‍చరణ్‍కు వేల్స్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. నేడు జరిగిన స్నాతకోత్సవంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల ఎడ్యుకేషన్ (AICTE) ప్రెసిటెండ్ డీజీ సీతారాం.. చరణ్‍కు ఈ డాక్టరేట్ అందించారు.

సంతోషంలో ఫ్యాన్స్

రామ్‍చరణ్‍కు డాక్టరేట్ ఇచ్చిన సమయంలో ఆడిటోరియంలో విద్యార్థులు ఈలలు, కేకలతో మోతెక్కించారు. చరణ్ ఈ గౌరవం అందుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ డాక్టరేట్ స్వీకరించటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

చరణ్ కెరీర్

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్‍చరణ్‍. 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. మగధీతో స్టార్ హీరో రేంజ్‍కు వెళ్లారు. రికార్డులను బద్దలుకొట్టారు. అనంతరం ఆరెంజ్, రచ్చ సహా మరిన్ని సినిమాలు చేశారు. 2016లో వచ్చిన ధృవ మంచి హిట్ అయింది. రంగస్థలం చిత్రంలో రామ్‍చరణ్.. తన నటన సత్తాచాటారు. బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక, ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍లో ఫేమస్ అయ్యారు చెర్రీ. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రామ్‍చరణ్ ఇప్పటి వరకు 14 చిత్రాలు చేశారు.

రామ్‍చరణ్ లైనప్

రామ్‍చరణ్ 15వ సినిమాగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది. తమిళ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత చెర్రీ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రంలో ఏఐఎస్ అధికారిగా చరణ్ నటిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆ మూవీ ఉండనుంది.

గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి జరగండి అంటూ ఓ పాట వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్‍‍రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ మూవీని (RC16) రామ్‍చరణ్ చేయనున్నారు. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా ఉండనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తనకు రంగస్థలం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్‌తో తదుపరి మూవీ (RC17)కి కూడా రామ్‍చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవలే వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం