RC16 Pooja Ceremony: గ్రాండ్‍గా రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరూ: ఫొటోలు చూసేయండి-rc16 pooja ceremony photos ram charan director buchi babu sana movie begins chiranjeevi clapped ar rahman attended ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rc16 Pooja Ceremony: గ్రాండ్‍గా రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరూ: ఫొటోలు చూసేయండి

RC16 Pooja Ceremony: గ్రాండ్‍గా రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరూ: ఫొటోలు చూసేయండి

Published Mar 20, 2024 06:43 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 20, 2024 06:43 PM IST

  • RC16 Pooja Ceremony: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‍లో తెరకెక్కనున్న సినిమా మొదలైంది. నేడు (మార్చి 20) ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమం ఫొటోలు ఇక్కడ చూడండి.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో  మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా (RC16) చేస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగాయి. మూవీ టీమ్‍తో పాటు కొందరు అతిథులు పాల్గొన్నారు. 

(1 / 6)

ఆర్‌సీ16 సినిమా ముహూర్తం షాట్‍కు సీనియర్ హీరో, రామ్‍చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. రామ్‍చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ఫస్ట్ షాట్‍కు క్లాప్ చేశారు. 

(2 / 6)

ఆర్‌సీ 16 చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కార్యక్రమానికి వైట్ సూట్ ధరించి ఆయన వచ్చారు. చరణ్‍తో ఆయన ముచ్చటిస్తున్న దృశ్యమిది. 

(3 / 6)

ఆర్‌సీ16 మూవీలో రామ్‍చరణ్‍కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

(4 / 6)

ఈ సినిమా పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్లు శంకర్, సుకుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, బోనీ కపూర్ సహా మరికొందరు అతిథులుగా హాజరయ్యారు. 

(5 / 6)

ఆర్‌సీ16 మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ సమర్పిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్‍చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పూర్తయ్యాక ఆర్‌సీ16 మూవీ షూటింగ్ షురూ కానుంది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు