తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc 17 Ram Charan Sukumar: రామ్‍చరణ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. రంగస్థలం కాంబో రిపీట్

RC 17 Ram Charan Sukumar: రామ్‍చరణ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. రంగస్థలం కాంబో రిపీట్

25 March 2024, 15:19 IST

    • Ram Charan Sukumar Movie - RC 17: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కొత్త సినిమాపై ప్రకటన వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఆయన మూవీ చేయనున్నారు. దీంతో రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఆ వివరాలివే.. 
RC 17 Ram Charan Sukumar: రామ్‍చరణ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. రంగస్థలం కాంబో రిపీట్
RC 17 Ram Charan Sukumar: రామ్‍చరణ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. రంగస్థలం కాంబో రిపీట్

RC 17 Ram Charan Sukumar: రామ్‍చరణ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. రంగస్థలం కాంబో రిపీట్

RC 17 - Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా (RC16)కు ఓకే చెప్పారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే, తనకు రంగస్థలం లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్‌తో రామ్‍చరణ్ మరో మూవీ చేయనున్నారు. ఈ చిత్రానికి (RC17) సంబంధించిన అధికారిక ప్రకటన నేడు (మార్చి 25) వచ్చేసింది.

ట్రెండింగ్ వార్తలు

OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

Vishwak Sen: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాడ్ సాంగ్.. చీకటి ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేస్తూ!

OTT Best Movies: 5 ఓటీటీల్లోని 5 బెస్ట్ సినిమాలు ఇవే! ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అంటే?

Madhavan: బ్లాక్‌బ‌స్ట‌ర్ ల‌వ్‌స్టోరీతో మాధ‌వ‌న్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది - ఆ మూవీ ఎలా మిస్స‌యిందంటే?

రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. నేడు హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. రెండు గుర్రాలు ఉన్న ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.

రంగస్థలం కాంబినేషన్ రిపీట్

సుకుమార్ దర్శకత్వంలో రామ్‍చరణ్ హీరోగా 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ ‘రంగస్థలం’ భారీ హిట్ అయింది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ఆర్‌సీ17 చిత్రానికి ఈ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది.

రామ్‍చరణ్ 17వ చిత్రంగా రూపొందే ఈ మూవీని సుకుమార్ అత్యంత భారీగా అద్భుతంగా తెరకెక్కించనున్నారని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారని తెలిపింది.

గుర్రాలతో..

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రెండు గుర్రాలను హైలైట్ చేసింది మూవీ టీమ్. దీంతో ఈ చిత్రం హార్స్ రేసింగ్ బ్యాక్‍డ్రాప్‍లో ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. భూమిబద్దలయ్యే మాగ్నమ్ ఓపస్‍ కోసం శక్తులు ఏకమయ్యాయంటూ చరణ్, సుకుమార్ కలిసిన ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

రిలీజ్ ప్లాన్ ఇదే..

రామ్‍చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక.. ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.

రామ్‍చరణ్ పుట్టినరోజుకు ముందే..

మార్చి 27వ తేదీన రామ్‍చరణ్ తన 39వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజున సుకుమార్ చిత్రానికి సంబంధించి ప్రకటన వస్తుందని తొలుత సమాచారం బయటికి వచ్చింది. అయితే, అందుకు రెండు రోజుల ముందే అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

రామ్‍చరణ్ పుట్టిన రోజున గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తొలి పాట రిలీజ్ కానుందని తెలుస్తోంది. అదే రోజున ఈ మూవీ విడుదల తేదీని కూడా టీమ్ వెల్లడిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో మార్చి 27వ తేదీన కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత చెర్రీ చేస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్‍చరణ్ - బుచ్చిబాబు చిత్రం టైటిల్ కూడా మార్చి 27వ తేదీన రివీల్ అవుతుందని కూడా ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం