తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Collection: 1000 కోట్ల వైపుగా పుష్ప 2- ఇండియాలో పడిపోయిన వసూళ్లు- 6 రోజుల కలెక్షన్స్ ఇవే- 6 సినిమాల మార్క్ దాటి

Pushpa 2 Collection: 1000 కోట్ల వైపుగా పుష్ప 2- ఇండియాలో పడిపోయిన వసూళ్లు- 6 రోజుల కలెక్షన్స్ ఇవే- 6 సినిమాల మార్క్ దాటి

Sanjiv Kumar HT Telugu

11 December 2024, 9:42 IST

google News
  • Pushpa 2 Collection Worldwide Total: పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ అంచనాలను మించిపోతున్నాయి. ఇప్పటికే ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 922 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన పుష్ప 2 మూవీ ఆరు రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

1000 కోట్ల వైపుగా పుష్ప 2- ఇండియాలో పడిపోయిన వసూళ్లు- 6 రోజుల కలెక్షన్స్ ఇవే- 6 సినిమాల మార్క్ దాటి
1000 కోట్ల వైపుగా పుష్ప 2- ఇండియాలో పడిపోయిన వసూళ్లు- 6 రోజుల కలెక్షన్స్ ఇవే- 6 సినిమాల మార్క్ దాటి

1000 కోట్ల వైపుగా పుష్ప 2- ఇండియాలో పడిపోయిన వసూళ్లు- 6 రోజుల కలెక్షన్స్ ఇవే- 6 సినిమాల మార్క్ దాటి

Pushpa 2 The Rule Box Office Collection Day 6: సుకుమార్ దర్శకత్వంలో ఐకానికి స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి జోడీగా నటించిన సినిమా పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ అంచనాలకు మించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

ఐదు రోజుల కలెక్షన్స్

ఇప్పటికే ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ సినిమా రూ. 922 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు ఆరో రోజున కూడా అదే రేంజ్‌లో పుష్ప 2 కలెక్షన్స్ ఉన్నట్లు ట్రేడ్ సంస్థల లెక్కలు ఉన్నాయి.

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి ఆరో రోజున ఇండియాలో రూ. 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, ఐదో రోజు వచ్చిన రూ. 64.45 కోట్ల నెట్ వసూళ్లతో పోలిస్తే ఆరో రోజున పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ పడిపోయాయి. దాదాపుగా 18.70 శాతం పుష్ప 2 కలెక్షన్స్ పడిపోయాయి.

పడిపోయిన కలెక్షన్స్

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ట్రెండ్స్ ప్రకారం తొలి ఆదివారం రూ.141.05 కోట్లు వసూలు చేసిన పుష్పరాజ్ సోమవారం 54.31 శాతం భారీ పతనాన్ని చవిచూశాడు. ఇక ఆరో రోజు ఆదాయం మరో 18.70 శాతం క్షీణించడంతో మంగళవారం కూడా ఇదే తగ్గుదల ధోరణి కొనసాగింది. మంగళవారం ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 52.50 కోట్లు వసూలు చేసింది.

ఈ 52.50 కోట్లల్లో ప్రాంతీయ భాషల అయిన తెలుగు నుంచి రూ.11 కోట్లు, తమిళంలో రూ.2.6 కోట్లు, కన్నడ ద్వారా రూ.40 లక్షలు, మలయాళంలో రూ.50 లక్షలు వసూలు చేసింది. అయితే, హిందీ బెల్ట్ ద్వారా అన్నిటికంటే ఎక్కువగా రూ.38 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన భారతదేశంలో 6 రోజుల్లో పుష్ప 2కు రూ. 645.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

ఇందులో తెలుగు నుంచి రూ. 222.6 కోట్లు, హిందీ ద్వారా రూ. 370.1 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 37.10 కోట్లు, కన్నడలో రూ. 4.55 కోట్లు, మలయాళంలో రూ. 11.7 కోట్లు కలెక్షన్స్ ఉన్నాయి. ఆరు రోజుల్లో తెలుగులో వచ్చిన నెట్ కలెక్షన్స్ కంటే హిందీ వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఆరో రోజున తెలుగులో పుష్ప 2 సినిమాకు 34.79 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇక ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం పుష్ప 2 మూవీ 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 950 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా పుష్ప 2 మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో దాదాపుగా అరడజను (ఆర్ఆర్ఆర్, కల్కి, బాహుబలి 2, స్త్రీ 2, జవాన్, కేజీఎఫ్ 2) సినిమాల మార్కును దాటి హిట్ కొట్టింది పుష్ప 2 మూవీ.

అలాగే, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప 2 ది రూల్ మూవీ అత్యంత వేగంగా రూ. 900 కోట్ల మైలురాయిని దాటిన భారతీయ చిత్రంగా నిలిచింది.

తదుపరి వ్యాసం