Action Comedy OTT: 40 కోట్ల బడ్జెట్ - 5 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి పుష్ప 2 ప్రొడ్యూసర్ల మలయాళం డిజాస్టర్ మూవీ
Action Comedy OTT: పుష్ప 2 ప్రొడ్యూసర్లు నిర్మించిన మలయాళం మూవీ నడికర్ థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ నెలాఖరు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ నడికర్ థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు లాల్ జూనియర్ దర్శకత్వం వహించాడు. దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సౌబీన్ షాహిర్, బాలు వర్గీస్, భావన కీలక పాత్రలు పోషించారు.
ఈ మలయాళ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. మైత్రీ నిర్మాతలకు ఇదే తొలి మలయాళ మూవీ కావడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే 500 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఏడు నెలల తర్వాత...
థియేటర్లలో రిలీజై ఏడు నెలలు అవుతోన్న ఇప్పటివరకు నడికర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నిర్మాతలకు, నెట్‌ఫ్లిక్స్ సంస్థతో ఏర్పడిన విభేదాల కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది.
తాజాగా ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్‌లోనే నడికర్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నడికర్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
నడికర్ స్టోరీలైన్
స్టార్ హీరో డేవిడ్‍కు వరుసగా మూడు భారీ ప్లాఫ్‍లు ఎదురవుతాయి. ఈ పరాజయాల కారణంగా అతడితో సినిమాలు చేసేందుకు దర్శకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోతాయి. అతడి మేనేజర్ పైలీ (సురేశ్ కృష్ణ) కష్టపడి డేవిడ్‍తో మూవీ చేసేందుకు ఓ దర్శకుడిని ఒప్పిస్తాడు. అయితే, డేవిడ్ తన పొగరుతో ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకుంటాడు.
తనలో యాక్టింగ్ టాలెంట్ తగ్గిపోవడం వల్లే ఆఫర్లురావడం లేదని డేవిడ్ అనుకుంటాడు.యాక్టింగ్ కోచ్ బాలు (సౌబిన్ షాహిర్)ను నియమించుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్, బాలు మధ్య కూడా ఈగో సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఏమైంది? డేవిడ్ మళ్లీ స్టార్ డమ్ తెచ్చుకున్నాడా? డేవిడ్ కెరీర్‌ను నిలబెట్టడంలో బాలు ఏ విధమైన సాయం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
40 కోట్ల బడ్జెట్...
టోవినో థామస్ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో నడికర్ మూవీ తెరకెక్కింది. కాన్సెప్ట్ ఆకట్టుకోకపోవడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నడికర్ డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం ఐదు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు 35 కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది.
ఐడెంటీటీ...
ఈ ఏడాది నడికర్‌తో పాటు అన్వేషిప్పిమ్ కండేతుమ్, ఏఆర్ ఎమ్ సినిమాలు చేశాడు టోవినో థామస్. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. త్వరలోనే ఐడెంటీటీ మూవీతో మలయాళ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరిలో ఫస్ట్ వీక్‌లో ఐడెంటీటీ మూవీ రిలీజ్ కాబోతోంది.