తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sooseki Song Lyrics Pushpa: పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి

Sooseki song lyrics pushpa: పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి

Hari Prasad S HT Telugu

05 June 2024, 12:23 IST

google News
    • Pushpa 2 Second Single Lyrics: పుష్ప 2 మూవీ నుంచి సూసేకీ అంటూ అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజైన విషయం తెలుసు కదా. ఈ కపుల్ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ అయింది.
పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి
పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి

పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి

Pushpa 2 Second Single Lyrics: పుష్ప 2 సెకండ్ సింగిల్ వచ్చేసింది. ది కపుల్ సాంగ్ అంటూ సూసేకి పాటను బుధవారం (మే 29) మేకర్స్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ చెవులకు ఇంపైన మ్యూజిక్, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషాల్ వాయిస్ తో ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ అయింది. దీనికితోడు అల్లు అర్జున్, రష్మిక జోడీ వేసిన స్టెప్పులు ప్రతి జంటకు ఓ కొత్త డ్యాన్స్ మూవ్ అందించిందని చెప్పాలి.

అదరగొడుతున్న సూసేకి సాంగ్

పుష్ప 2 మూవీలోని ఈ సూసేకి పాటను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాశాడు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పుష్ప మూవీలో శ్రీవల్లి పాట దేశాన్ని ఎంతలా ఊపేసిందో తెలుసు కదా. ఇప్పుడీ మెలోడీ కూడా అదే స్థాయిలో హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు లేచి స్టెప్పులేసేలా ఈ సాంగ్ బీట్ అదిరిపోయింది.

ఇక గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ కూడా ఈ సూసేకి పాటకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. అల్లు అర్జున్, రష్మికతో అతను వేయించి స్టెప్పులు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతాయి. పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ మాస్ బీట్ తో సాగిపోగా.. ఈ సెకండ్ సింగిల్ మాత్రం మెలోడీ లవర్స్ ను కట్టి పడేస్తుందనడంలో డౌట్ లేదు. పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కింద ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. మీరు కూడా కాస్త మీ గొంతును సవరించి పాడటం మొదలు పెట్టండి.

సూసేకీ సాంగ్ లిరిక్స్

వీడు మొరటోడు..

అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్న

పసిపిల్ల వాడు నా వాడు

వీడు మొండోడు

అని ఊరువాడ అనుకున్నగానీ..

మహరాజు నాకు నా వాడు..

ఓ.. మాట పెళుసైనా..

మనుసులో వెన్నా..

రాయిలా ఉన్నవాడిలోన

దేవుడెవరికి తెలుసును నాకన్న

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..

మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..

ఓ... ఎర్రబడ్డా కళ్లలోనా..

కోపమే మీకు తెలుసు..

కళ్లలోన దాచుకున్న

చెమ్మ నాకే తెలుసు..

కోర మీసం రువ్వుతున్న

రోషమే మీకు తెలుసు..

మీసమెనక ముసురుకున్న

ముసినవ్వు నాకు తెలుసు..

అడవిలో పులిలా సర సర సర సర

చెలరేగడమే మీకు తెలుసు..

అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..

మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..

ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే..

ఇచ్చివేసే నవాబు..

నన్ను మాత్రం

చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు

పెద్ద పెద్ద పనులు ఇట్టే..

చక్కబెట్టే మగాడు..

వాడి చొక్క ఎక్కడుందో..

వెతకమంటాడు చూడు..

బయటకు వెళ్లి ఎందరెందరినో..

ఎదిరించేటి దొరగారు..

నేనే తనకీ ఎదురెళ్లకుండా..

బయటకు వెళ్లరు శ్రీవారు..

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..

ఇట్టాంటి మంచి మొగడుంటే.. ఏ పిల్లయినా మహరాణి..

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం