Chandrabose: భార్య సినిమాకు ఫస్ట్ టైమ్ గెస్ట్‌గా చంద్ర‌బోస్ - శ‌బ‌రి సాంగ్ రిలీజ్ చేసిన ఆస్కార్ విన్న‌ర్‌-anaganaga o kathala song from varalaxmi sarath kumar sabari released by oscar winner chandrabose ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandrabose: భార్య సినిమాకు ఫస్ట్ టైమ్ గెస్ట్‌గా చంద్ర‌బోస్ - శ‌బ‌రి సాంగ్ రిలీజ్ చేసిన ఆస్కార్ విన్న‌ర్‌

Chandrabose: భార్య సినిమాకు ఫస్ట్ టైమ్ గెస్ట్‌గా చంద్ర‌బోస్ - శ‌బ‌రి సాంగ్ రిలీజ్ చేసిన ఆస్కార్ విన్న‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 27, 2024 02:31 PM IST

Chandrabose: శ‌బ‌రి సినిమాలోని అనగనగా ఒక కథలా... పాట‌ను శ‌నివారం ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ రిలీజ్ చేశాడు. ఈ పాట‌కు చంద్ర‌బోస్ స‌తీమ‌ణి సుచిత్రా చంద్ర‌బోస్ కొరియోగ్ర‌ఫీ అందించారు. భార్య కొరియోగ్ర‌ఫీ అందించిన పాట‌ను చంద్ర‌బోస్ రిలీజ్ చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌

శ‌బ‌రి సినిమా
శ‌బ‌రి సినిమా

Chandrabose: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా శబరి మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ఏడు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్పీడు పెంచేశారు. ఇప్ప‌టికు రిలీజ్ చేసిన టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

తాజాగా ఈ మూవీలోని అనగనగా ఒక కథలా...అనే పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాట‌ను దిగ్గ‌జ గాయ‌ని చిత్ర ఆల‌పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు.

సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ…

'అనగనగా ఒక కథలా...' పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్ర‌ఫీ సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.

గోపీసుందర్ మ్యూజిక్ బాగుంది…

పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ...'"అనగనగా ఒక కథలా... పాటలో గోపీసుంద‌ర్ మ్యూజిక్‌, రెహ‌మాన్ లిరిక్స్ బాగున్నాయి. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా.

చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశాడు రెహ‌మాన్‌. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి'' అని చెప్పారు.

రిలీజ్ చేయడం ఫస్ట్…

సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ... ''నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. 'శబరి' సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది'' అని‌ చెప్పారు.

సైకలాజికల్ థ్రిల్లర్…

మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ..."తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా 'శబరి' ప్రత్యేకంగా నిలుస్తుంది. కన్న బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళుతుందనేది చెప్పే చిత్రమిది. బరువైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. వరలక్ష్మి గారి నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. మే 3న ప్రేక్షకులకు థియేటర్లలో 'శబరి' థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది'' అని చెప్పారు.

శ‌బరి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

పాట లిరిక్స్ ఇవే...

''అనగనగా ఒక కథలా

ఓ చందమామా

కడవరకు కరగదులే

ఈ అమ్మ ప్రేమ

పిలుపులు నీవైతే

బదులును నేనౌతూ

ఎదురుగ ఉంటాలే కదలక

అడుగులు నీవైతే

గొడుగును నేనౌతూ

చకచక వస్తాలే వదలక..అనగనగా

తడబడుతూనే నిలబడుతుంటే

కళ్లకు ఆనందమే

గడపను దాటి కదిలితే నువ్వు

గుండెకు ఆరాటమే

నువ్వేకదా ప్రపంచం

నువ్వంటే నా సంతోషం

IPL_Entry_Point